వస్తు సేవల పన్ను (జీఎస్టీ)... మాన్యుల నుంచి సామాన్యుల వరకు అందర్నీ పన్ను పరిధిలోకి తెచ్చిన వన్ నేషన్ వన్ ట్యాక్స్ ఆలోచన. ఈ పన్ను కారణంగా ప్రభుత్వంపై వచ్చిన వ్యతిరేకతే ఎక్కువ అనేది కొందరి భావన. ఇలాంటి చర్చోపచర్చల నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ పరోక్షంగా ఓ క్లారిటీ ఇచ్చారు. పన్ను రేట్లను మరింత సరళతరం చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో జీఎస్టి పన్ను రేట్లు 12 శాతం 18 శాతాన్ని విలీనం చేస్తామన్నారు. ``వస్తు సేవల పన్నులో సాధారణంగా వినియోగించే వస్తువులు పన్ను రేటు ప్రస్తుతం 12 శాతం 18 శాతం మధ్యలో ఉన్నాయి. వీటితో పాటు నిత్యావసర వస్తువులు 0 నుంచి 5 శాతం… తప్పించి అలాగే విలాసవంతమైన - ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులు మినహాయించి మిగిలిన వస్తువులను 12 శాతం 18 శాతం పరిధిలోకి వచ్చే వాటిని విలీనం చేసి వాటికి మధ్యస్తంగా రేటు నిర్ణయిస్తాం``అని జైట్లీ అన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పరోక్ష పన్న రేటు దేశంలో అత్యధికంగా 31 శాతం వరకు ఉందని విమర్శించడంతో ప్రభుత్వం దిగివచ్చింది. తాజాగా జైట్లీ ఈమేరకు క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ రెవెన్యూ పెరిగితే ప్రస్తుతం మెజారిటి ప్రజలు వినియోగించే వస్తువులు 12-18 శాతం మధ్యలో ఉంటాయని.. వాటిని విలీనం చేస్తామని ఆయన చెప్పారు. దీంతో పాటు నిత్యావసర వస్తువుల రేటు 0-5 శాతం మధ్యలో ఉంటుందని - విలాసవంతమైన వస్తువులు.. ఆరోగ్యానికి హాని కలిగించే వస్తువులు మాత్రమే అత్యధిక టాక్స్ బ్రాకెట్ లో ఉంటాయని అన్నారు. జైట్లీ ఫేస్ బుక్ లో ‘జీఎస్టి అమల్లోకి వచ్చి 18 నెలలు’ అనే శీర్షికతో ఒక పోస్టును పెట్టారు. జీఎస్టి పరిధిలోకి వచ్చే వస్తువుల వివరాలను ఆయన పొందుపర్చారు. సుమారు 1,216 కమాడిటీలు లేదా వస్తువుల్లో 183 వస్తువులపై జోరో పన్ను విధిస్తున్నామని, అలాగే 308 వస్తువులపై 5 శాతం - 178 వస్తువులపై 12 శాతం - 517 వస్తువులపై 18 శాతం పన్ను విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
భవిష్యత్తు రోడ్ మ్యాప్ గురించి ప్రస్తావిస్తూ.. రాబోయే రోజుల్లో 12 శాతం18 శాతం జీఎస్టి స్థానే సింగిల్ స్టాండర్డ్ పన్ను రేటును తీసుకువస్తామని ఆయన అన్నారు. దీని గురించి ఆయన మరింత వివరణ ఇస్తూ.. ప్రస్తుతం 12 శాతం 18 శాతం మధ్యలో ఉండేలా చూస్తామని ఆయన తెలిపారు. అయితే సింగిల్ టాక్స్ కు రావడానికి కొంత కాలం పడుతుందని.. రెవెన్యూ పెరిగే కొద్ది పన్ను రేట్లు సరళిస్తామని ఆయన అన్నారు.
రాబోయే రోజుల్లో దేశంలో కేవలం ఒకే శ్లాబ్ ఉంటుందని.. అది జీరో .. 5 శాతం మాత్రమేనని.. విలాసవంతమైన - ఆరోగ్యానికి హానికరం కలిగించే వస్తువులు తప్పించి స్టాండర్డ్ రేటు 5 శాతం పరిధిలోకి తెస్తామని జైట్లీ అన్నారు. ఆటో విడిభాగాలు - సిమెంట్ లు మాత్రమే ప్రస్తుతం 28 శాతం పరిధిలోకి ఉన్నాయని తదుపరి సమావేశంలో వీటిని కూడా అతి తక్కువ పరిధిలోకి తేవడానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా నిర్మాణరంగానికి వినియోగించే వస్తువులను ప్రస్తుతం 28 శాతం నుంచి 18 శాతానికి - 12 శాతానికి సవరించామన్నారు. జీఎస్టి ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదని.. అనుకున్న లక్ష్యం సాధించలేకపోయారన్న విమర్శను జైట్లీ కొట్టి వేశారు. ``కొత్త పరోక్ష పన్ను వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను రేట్లు తగ్గాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టింది. పన్ను ఎగ్గొట్టేవారు తగ్గారు` అని ఆయన అన్నారు.