దేశంలో రాజకీయాలన్నీ ఇపుడు గుజరాత్ వైపు చూస్తున్నాయి. గుజరాత్ శాసనసభ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం చూస్తే డిసెంబర్ 1, 5 తేదీలలో రెండు విడతలుగా గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 182 సీట్లకు గాను జరిగే ఈ ఎన్నికలు దేశానికి కొత్త సందేశాన్నే ఈసారి ఇవ్వనున్నాయని అంటున్నారు.
గుజరాత్ మోడల్ అభివృద్ధి అంటూ నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు దేశమంతా తిరిగి ప్రచారం చేశారు. ప్రజలు కూడా ఆకర్షితులై ఆయన్ని గెలిపించారు. అప్పటికి మోడీ గుజరాత్ ని ఏకనా మూడు విడతలు సీఎం గా పదమూడేళ్ళ పాటు పాలించారు. అలా సీఎం సీటు నుంచి ఎకాఎకీన ప్రధాని కుర్చీలోకి మోడీ రావడానికి గుజరాత్ పాత్ర ఎంతో కీలకంగా ఉంది.
ఇపుడు చూస్తే రెండు సార్లు పూర్తి మెజారిటీతో బీజీపీ కేంద్రంలో అధికారంలో ఉంది. 2024 ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్ ప్రధాని కావాలని మోడీ ఆశిస్తున్నారు. దానికి పునాదిగా గుజరాత్ ఉండాల్సిందే. ఇది మోడీతో పాటు అమిత్ షాకు కూడా గుజరాత్ సొంత రాష్ట్రమే. అక్కడ గెలిచి నిలిస్తేనే మోడీ షాలకు ఢిల్లీలో రాజదండం దక్కేది చిక్కేది అన్న విశ్లేషణలు ఉన్నాయి.
పైగా 2024 ఎన్నికలు దగ్గరలో ఉన్న తరుణంలో గుజరాత్ లో కనుక ఫలితాలు ఏమైనా తేడా కొడితే అది కచ్చితంగా బీజేపీకి ఇబ్బందిగా మారుతుంది. అదే సమయంలో మోడీని కేంద్రంలో అధికారం నుంచి దూరం చేయడానికి చూస్తున్న విపక్షాలకు అధి అది అందివచ్చిన అవకాశంగా మారుతుంది. అందుకే గుజరాత్ ఎన్నికల మీద ఇపుడు దేశం మొత్తం ఆసక్తిని ప్రదర్శిస్తోంది.
ఇంకో వైపు చూస్తే ఈ మధ్య వరసబెట్టి గుజరాత్ లో ప్రధాని పర్యటనలు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఒక విధంగా ముందస్తు ఎన్నికల ప్రచారాన్నే ఆయన చేశారు అని చెప్పాలి. కొద్ది రోజుల ముందు హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల షెడ్యూల్ ని ఈసీ ప్రకటించిన సమయంలోనే గుజరాత్ ఎన్నికల గురించి కూడా ప్రకటన ఉంటుందని అనుకున్నారు. కానీ ఈ రోజు షెడ్యూల్ విడుదల అయింది. ఈ లోగా బీజేపీ కూడా అక్కడ ప్రచారాన్ని బాగానే అధికారికంగా చేసి కొంతవరకూ పరిస్థితిని చక్కబెట్టుకుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఇప్పటికి మూడు దశాబ్దాల కాలంగా అయిదు విడతలుగా గుజరాత్ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతోంది. అయితే బీజేపీకి టఫ్ గా ఎన్నికలు నడిచింది మాత్రం 2017 లోనే అని చెప్పాలి. ఆ ఎన్నికల్లో బీజేపీకి 99 సీట్లు మాత్రమే దక్కాయి. అంటే అధికారానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ కి కొద్ది సీట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి. ఇక కాంగ్రెస్ అయితే 77 సీట్లతో బలంగా పుంజుకుంది. అయితే ఆ తరువాత పరిస్థితులు మారాయి. పటేల్స్ కోసం సామాజిక ఉద్యమాన్ని నడిపిన హార్ధిక్ పటేల్ ఇపుడు బీజేపీలో చేరిపోయాడు. మరో వైపు గుజరాత్ ఎన్నికల వేళ ప్రచారం చేయడానికి రాహుల్ వచ్చే అవకాశాలు లేవు. ఆయన పాదయాత్రలో ఉన్నారు.
ఇంకో వైపు చూస్తే ఆప్ పంజాబ్ ని గెలిచి గుజరాత్ మీద గురి పెట్టింది. ప్రజలు కూడా బీజేపీతో విసిగిన వారు కొత్త ఆల్టరెనషన్ గా ఆప్ వైపు చూస్తున్నారు. అయిఏ కొత్తగా రేసులోకి వచ్చిన ఆప్ అధికారాన్ని చేజిక్కించుకోగలదా అన్నదే ప్రశ్న. ఆప్ ఒకవేళ అధికారాన్ని దక్కించుకోకపోతే మాత్రం అది కాంగ్రెస్ అవకాశాలను ఓట్లను దెబ్బ తీసినట్లు అవుతుంది. అదే సమయంలో ట్రయాంగిల్ ఫైట్ లో బీజేపీ సేఫ్ గా బయటపడే చాన్సూ ఉంటుంది. మొత్తానికి చూస్తే గుజరాత్ మోడీ షాలకు అగ్ని పరీక్ష గానే చూస్తున్నారు.
ఈ ఫలితాలు కనుక బీజేపీకి పాజిటివ్ గా వస్తే దేశ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఆప్ వీర విహారం చేసినా ప్రధాన ప్రతిపక్షంగా అవతరించినా అపుడు దేశంలో రాజకీయ ముఖ చిత్రం మారడం తధ్యం. అలాగే కాంగ్రెస్ ఏ మాత్రం పుంజుకున్నా కూడా అది బీజేపీని 2024 ఎన్నికల్లో నిలువరించడానికి ఉపయోగపడుతుంది అని లెక్కలు వేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.