గుజరాత్ లో నిర్భయ కంటే దారుణ ఘటన

Update: 2020-01-11 09:33 GMT
దేశాన్ని కుదిపేసిన నిర్భయ, దిశ ఘటనలకంటే కూడా దారుణమైన ఘటన గుజరాత్ లో వెలుగుచూసింది. సభ్యసమాజాన్నే కలవరపెట్టింది.

గుజరాత్ లో ఓ దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కామాంధులు ఆమెను చంపేసి మర్రి చెట్టుకు వేలాడదీసిన వైనం కలకలం రేపింది.ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికుల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. బాధితురాలికి న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ కాజల్’ పేరుతో హ్యాష్ ట్యాగ్ దేశమంతా వైరల్ అయ్యింది. బాధిత యువతిని నలుగురు రేప్ చేసి చంపేసి చెట్టుకు వేలాడదీశారని వైద్యుల పోస్టుమార్టంలో తేలింది.

డిసెంబర్ 31 నుంచి బాధిత యువతి కనిపించడం లేదు. అంతా వెతికిన తల్లిదండ్రులు 3న పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ప్రియుడితో వెళ్లి పోయిందని.. ప్రచారం జరిగింది. తాజాగా యువతి చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి చంపినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పోలీసులు కేసు నమోదు చేసి బాధితులు ఆరోపించిన నలుగురు నిందితులు బిమల్, దర్శన్, సతీష్, జిగర్ అనే నలుగురు యువకులను అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.

కాగా ‘జస్టిస్ ఫర్ కాజల్’ బాలీవుడ్ హీరోలు, సెలెబ్రేటీలు కూడా మద్దతు తెలిపారు. న్యాయం చేయాలని కోరుతున్నారు
Tags:    

Similar News