ప్రేమికుల రోజున విద్యార్థులు ఈ పనిచేస్తున్నారు

Update: 2020-02-09 12:12 GMT
ఎవరైనా ప్రేమికుల రోజున ఏం చేస్తారు? తమ ప్రియురాలు/ప్రియుడితో కలిసి జల్సా చేస్తారు. కొత్తగా ప్రేమ పుట్టిన వారు ఆరోజు ప్రపోజ్ చేస్తారు. వాలైంటైన్స్ డేను యువత పండుగలా చేసుకుంటారు.

ఇంతటి అరుదైన రోజున గుజరాత్ లో మాత్రం విద్యార్థులతో ఒక కొత్త పనిని చేయించబోతున్నారు. గుజరాత్ లోని సూరత్ జిల్లాలోని  పాఠశాలల్లో  తల్లిదండ్రుల పూజా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు సూరత్ జిల్లా విద్యాశాఖాధికారి అన్ని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

భారతీయ సంస్కృతిని మరిచి విద్యార్థులు ప్రేమికుల దినోత్సవం జరుపుకోకుండా ఉండేందుకు తల్లిదండ్రులను పాఠశాలకు తీసుకొచ్చి వారికి పూజలు నిర్వహించి మిఠాయిలు పంచిపెట్టాలని జిల్లా విద్యాశాఖాధికారి అన్ని స్కూళ్లకు ఆదేశాలు జారీ చేశారు.

కాగా విద్యాశాఖ అధికారి ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు.  ఇది నాటకమని.. బీజేపీ సిద్ధాంతాలను స్కూళ్లలో అమలుచేస్తున్నారని గుజరాత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.


Tags:    

Similar News