దేశవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజా జీవితం తీవ్రంగా ప్రబావితం అవుతోంది. మహారాష్ట్ర - ఉత్తరాఖండ్ - అసోం - మణిపూర్ - పశ్చిమబెంగాల్ - గుజరాత్ రాష్ర్టాల్లో బుధవారం వర్షాల జోరుకు జనజీవనం స్తంభించింది. ఇప్పటికే నడుంలోతు నీటితో జలమయమైన ముంబై మహానగరాన్ని మరో 48 గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు ముంచెత్తనున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) హెచ్చరించింది. రుతుపవనాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్ - విదర్భ - ఛత్తీస్ గఢ్ లలో చురుగ్గా విస్తరించి ఉన్నాయని ఆ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఆరు రాష్ర్టాల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు ఈరోజు దేశ రాజధాని నగరం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. నార్త్ బ్లాక్ - పండిత్ పంత్ మార్గ్ - అక్బర్ రోడ్ తోపాటు పరిసర ప్రాంతాల్లో కుండబోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. వరద నీరు ఢిల్లీ సెక్రటేరియట్ లోపల ఉన్న గదుల్లోకి కూడా చేరుతుంది. ఉద్యోగులు వరద నీటిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.భారీ వర్షంతో తిలక్ బ్రిడ్జిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఇక ఆర్థిక రాజధాని అయిన ముంబై మహానగరం చిన్నసైజు సముద్రాన్ని తలపిస్తున్నది. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం పూర్తిగా జలమయమైంది. గత 10 రోజుల్లో రికార్డు స్థాయిలో 864.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుండపోత వర్షాలతో జనజీవనం దుర్భరంగా మారింది. వర్షాలధాటికి నగరంతోపాటు సమీపంలోని థానె - పాల్గాఢ్ జిల్లాల్లోని చాలా రహదారులు - నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో జనం నడుంలోతు వరకు నీటిలోనే ఉంటూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైళ్ల సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టాలపై భారీగా వర్షపునీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్లన్నీ నిలిపివేశారు. నల్లాస్ పొరా - వసాయ్ స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో అక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. చర్చిగేట్ నుంచి భయాందర్ మార్గంలో కేవలం 10 కిలోమీటర్ల వేగంతో మాత్రమే లోకల్ రైళ్లు నడిపిస్తున్నారు. దీంతో వేలాది మంది ప్రయాణికులతో బోగీలు కిక్కిరిసిపోతున్నాయి. సబర్బన్ పరిధిలో రైల్వేసేవలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు వర్షాల కారణంగా శతాబ్ది - వడోదర ఎక్స్ ప్రెస్ రైళ్లలో చిక్కుకుపోయిన 2,000 మంది ప్రయాణికులను జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్ డీఆర్ ఎఫ్) - పోలీసులు రక్షించి వారిని ఆయా ప్రాంతాలకు తరలించారు. వర్షాల వల్ల మహారాష్ట్రలో 11 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.