తన అధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఉక్రెయిన్ మీద విరుచుకుపడ్డ రష్యా.. గడిచిన నెల రోజులకు పైనే సోదర దేశాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్ని.. నగరాల్లో నేలమట్టం చేసి.. కోలుకోలేనంత దారుణ పరిస్థితికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటివేళ.. గుజరాత్ కు చెందిన గాయని ఒకరు ఉక్రెయిన్ కు సాయం చేయాలన్న ఆలోచనతో అమెరికాలో ఒక కచేరీని నిర్వహించారు.
ఈ షోకు భారీ స్పందన లభించటమే కాదు.. ఆమె పాటలకు మురిసిపోయిన వారు.. ఆమె మీద డాలర్ల వర్షాన్ని కురిపించారు. దీంతో.. స్టేజ్ మొత్తం డాలర్ల కుప్పగా మారింది. ఇంతకీ ఆ గాయని ఎవరు? ఆమె ప్రత్యేకత ఏమిటి? ఇంతకీ భారీగా కురిసిన డాలర్ల లెక్క ఎంత తేలింది? అన్న విషయాల్లోకి వెళితే..గుజరాత్ కు చెందిన గీతాబెన్ సింగర్ గా సుపరిచితురాలు.
ఆమె షో కోసం గుజరాతీలు తెగ తపిస్తుంటారు. ఆమె పాటల్ని వినేందుకు విపరీతమైన ఆసక్తిని చూపిస్తుంటారు. గుజరాత్ తో పాటు ఆమె పలు దేశాల్లో ప్రదర్శనలు ఇస్తుంటారు.
2020లో గుజరాత్ లో నిర్వహించిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోనూ ట్రంప్.. మోడీ ముందు కూడా గీతా బెన్ తన సంగీత కచేరీ ప్రదర్శన ఇవ్వటం తెలిసిందే.
ఉక్రెయిన్ మీద రష్యా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా.. ఆ దేశానికి ఏదైనా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఆమె అమెరికాలో ఒక షోను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు హాజరైన వారు ఆమె పాటలకు మురిసిపోవటమే కాదు.. పెద్ద ఎత్తున డాలర్లను వెదజల్లారు. దీంతో.. స్టేజ్ మొత్తం డాలర్లు పోగుపడ్డాయి.
షో అనంతరం వర్షం మాదిరి కురిసిన డాలర్లను లెక్కిస్తే.. అవి ఏకంగా రూ.2.25 కోట్లుగా తేలాయి. ఈ డాలర్ల వర్షానికి సంబంధించిన వీడియోలను.. ఫోటోలను గీతా బెన్ తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. అవికాస్తా వైరల్ గా మారాయి. గీతాకు ఉన్న క్రేజ్ ఎంతన్న విషయం తాజా షోతో మరోసారి నిరూపితమైంది.
Full View