తెలంగాణ టీడీపీ నుంచి కొనసాగుతున్న వలసల వరదకు బ్రేక్ పడిందని అనుకుంటున్న సమయంలో తెలంగాణ టీడీపీ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి గులాబీ పార్టీలో చేరిక వార్త తెరమీదకు వచ్చింది. త్వరలో ఆమె టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు అంతటా ప్రచారం జరిగిన తర్వాత సుధారాణి తాపీగా మీడియా ముందుకు వచ్చారు. అది కూడా ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఢిల్లీలో సమావేశం అయిన తర్వాత అక్కడే ఉన్న మీడియాతో మొహమాటానికయిన ఆమె స్పందించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అభివృద్ధిపథం వైపు నడిపిస్తున్నారని సుధారాణి ప్రశంసించారు. వాటర్ గ్రిడ్ - మిషన్ కాకతీయ - ఇతర సంక్షేమ పథకాల అమలు బాగున్నాయని టీడీపీ ఎంపీ కితాబిచ్చారు. తాను కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుదామని కేసీఆర్ ను కలిసినట్లు ఆమె తెలిపారు. అయితే తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని ప్రకటించారు.
వరంగల్ ను స్మార్ట్ సిటీగా చేస్తానన్నందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపేందుకు కలిశానని అన్నారు. స్మార్ట్ సిటీగా ప్రకటించి దాదాపు రెండు నెలలు పూర్తయిన తర్వాత సుధారాణి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపానని అనటం ఢిల్లీ జర్నలిస్టులను షాక్ కు గురిచేసింది. ఎంపీ చెప్పినవన్నీ విన్నప్పటికీ అందులో పార్టీ మార్పు అనే పాయింట్ లేకపోవడంతో ఓపిక నశించిన జర్నలిస్టులు...ఇంతకూ మీరు టీఆర్ ఎస్ లో చేరుతున్నారా లేదా అని ప్రశ్నించగా...జరగబోయేది మీరే చూస్తారు కదా అంటూ సుధారాణి ముక్తాయించారు.