టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ ఇళ్లపై ఐటీ అధికారులు సోదాల వ్యవహారం ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ సోదాల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య వెర్బల్ వార్ నడుస్తోంది. టీడీపీ నేతలపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణితోనే ఐటీ దాడులు చేయిస్తోందని టీడీపీ నాయకులు ఆరోపించారు. అవినీతికి పాల్పడనపుడు టీడీపీ నేతలకు భయమెందుకని బీజేపీ నేతలు కౌంటర్లు పేలుస్తున్నారు. తనపై జరుగుతోన్న ఐటీ సోదాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ కు రమేష్ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆ సవాల్ కు జీవీఎల్ స్పందించారు. సీఎం రమేష్ కు ట్విటర్ లో జీవీఎల్ సవాల్ విసిరారు. రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసని, రమేష్ లాగా ఛాలెంజ్ చేసిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి గతంలో తోక ముడిచారని అన్నారు.
రమేష్ కూడా అంతేనా అని ప్రశ్నించారు. టీడీపీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ.... పెర్ఫార్మన్స్ తక్కువని జీవీఎల్ ఎద్దేవా చేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా తాను బహిరంగ చర్చకు రెడీ అని, టీడీపీ నేతలు సిద్ధమా అని సవాల్ విసిరారు. తనకు సీఎం రమేష్ ఛాలెంజ్ చేసిన వీడియోను కూడా తన ట్విట్టర్ ఖాతాలో జీవీఎల్ పోస్ట్ చేశారు. అంతకుముందు మరో ట్వీట్ లో టీడీపీ ఎంపీలపై జీవీఎల్ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలకు ఆర్భాటం ఎక్కువ..... అవగాహన తక్కువ అని ఎద్దేవా చేశారు. స్టీల్ మినిస్టర్ బిరేంధేర్ సింగ్ గారిని కలిసే ముందు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జీఎస్ఐ ద్వారా సబ్మిట్ చేయవలసిన రిపోర్ట్ ఆలస్యం అయ్యిందో తెలుసుకుంటే బాగుండేదని సెటైర్ వేశారు. డ్రామాలపైనా, అవినీతి పైన ఉన్న శ్రద్ధ అభివృద్ధిపైన ఉండుంటే రాష్ట్రం బాగుపడేదని టీడీపీ ఎంపీలకు జీవీఎల్ చురకలంటించారు