ఒకప్పుడు ఎన్నో ఘటనల్లో ఎంతోమంది నేరస్తులు ప్రత్యక్ష సాక్షులు లేరు అన్న ఒకే ఒక సాకుతో న్యాయస్థానాల్లో శిక్షలు తప్పించుకున్నారు. కానీ , గత కొన్ని నెలల క్రితం హాజీపూర్, గొర్రెకుంట ఘటనల్లో సైకోలకు న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. ఈ రెండు ఘటనల్లోనూ ప్రత్యక్ష సాక్షులు లేకున్నా, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా న్యాయస్థానం నిందితులకు క్యాపిటల్ పనిష్మెంట్ ఇచ్చింది.
ఈ సైకోలు చేసిన దూరుణాలకి ప్రత్యక్ష సాక్షులు లేఉన్నా శిక్షలు పడటంలో కీలక పాత్ర వహించింది కోర్టు డ్యూటీ ఆఫీసర్ (సీడీవో) లేదా కోర్టు లైజినింగ్ ఆఫీసర్. నేరం జరిగింది , దాన్ని కేసుగా నమోదు చేసింది మరో ఎత్తు అయితే , కోర్టులో దాన్ని నిరూపించడం మరో ఎత్తు. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టినా పోలీసుల శ్రమ వృధా అయిపోతుంది.
అందుకే, ఈ లోపాన్ని సరిచేయడానికి డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి స్టేషన్స్ సిబ్బంది పనిని మొత్తం 17 వర్టికల్స్ గా విభిజించారు. ఇందులో రిసెప్షన్, రైటర్, డయల్ 100, డిటెక్టివ్, క్రైంస్టాఫ్ తదితర విభాగాలు కీలకం. వీటన్నింటిలో సీడీవోల పని కీలకం. ఈ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక రాష్ట్రంలో కన్విక్షన్లు పెరిగి డిస్పోజల్స్ తగ్గుతూ రావడం గమనార్హం. సీడీవోలుగా రాష్ట్రంలోని అన్ని ఠాణాల నుంచి కానిస్టేబుల్, ఏఎస్సై ర్యాంకు ఆఫీసర్లకు హైదరాబాద్ జేఎన్ టీయూలో ప్రత్యేకంగా పలు ఐపీసీ సెక్షన్లు, లీగల్ వ్యవహారాల్లో శిక్షణ ఇచ్చారు.
సాక్షుల వాంగ్మూలం రికార్డు, వారికి రక్షణ, వాయిదాలకు హాజరయ్యేలా చూడటం, సాంకేతిక ఆధారాల నివేదిక, చార్జిషీటు సరైన సమయంలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసీజేఎస్) ద్వారా కోర్టుకు సమర్పించడం, సీసీ నంబర్ తీసుకోవడం కోర్టు వాయిదాలపై క్యాలెండర్ రూపొందించడం తదితర విధులు అతనే నిర్వర్తించాలి.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో కలసి దర్యాప్తు అధికారులు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కు న్యాయస్థానం విషయాలు వివరించాలి. వీరు ప్రతీ శనివారం ఠాణాలో సమీక్ష నిర్వహిస్తారు. దీనికి ఎస్ హెచ్ వో, దర్యాప్తు అధికారులు హాజరవుతారు. ఈ నివేదికను డీజీ కార్యాలయంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కు అందజేస్తారు. అన్ని వర్టికల్స్ తోపాటు సీడీవోల పనితీరుపై సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ నిరంతరం డేటా నిర్వహిస్తోంది.
ఇక్కడ అధికారులు రాష్ట్రంలోని అన్ని యూనిట్ల నుంచి నిరంతరం వచ్చే నివేదికలు చూసి పొరపాట్లు ఉంటే సరిచేస్తారు. కన్విక్షన్, డిస్పోసల్స్ వివరాలు డేటాబేస్ లో నమోదు చేస్తారు. సీడీవోల అత్యుత్తమ ప్రతిభను, లోటుపాట్లను పేర్లు లేకుండా అందరికీ అందజేస్తారు. ఈ కారణంగా అందరిలోనూ జవాబుదారితనం పెరిగి కేసుల్లో న్యాయస్థానం త్వరగా తీర్పులు వస్తున్నాయని సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ఇన్‌చార్జి డీఎస్పీ సత్యనారాయణ వివరించారు.