కంటపడిన అమ్మాయిల్ని విడిచి పెట్టకుండా దారుణంగా అత్యాచారం చేసి.. అనంతరం కర్కశంగా అంతమొందించే మానవమృగం మర్రి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ కు చెందిన శ్రీనివాస్ రెడ్డి.. అదే గ్రామానికి చెందిన ముగ్గురు మైనర్లను దారుణంగా చంపేసిన వైనం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇతగాడి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ్రీనివాసరెడ్డి ఉదంతాన్ని లోతుగా స్టడీ చేస్తున్న పోలీసులకు కొత్త విషయాన్ని గుర్తించారు. వేములవాడకు చెందిన ఒక అమ్మాయి విషయంలో శ్రీనివాసరెడ్డి జాగ్రత్తగా ఉన్నాడని.. ఆమెతో ప్రేమాయణం నడుపుతున్నట్లుగా చెబుతున్నారు.
తన సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కావటం.. తనను పెళ్లి చేసుకోవటానికి సిద్ధం కావటంతో ఆ అమ్మాయి విషయంలో దారుణ నిర్ణయం తీసుకోలేదన్న భావనలో పోలీసులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి ఫేస్ బుక్ ఖాతాను లోతుగా విశ్లేషించే క్రమంలో సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన యువతిని గుర్తించారు. ఆమెతో శ్రీనివాసరెడ్డి సన్నిహితంగా ఉండటంపై ఆరా తీయగా.. వేములవాడ దేవస్థానానికి వెళ్లిన క్రమంలో ఆ యువతితో తనకు పరిచయం ఏర్పడిందన్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది.
ఆమెను ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లుగా పోలీసులకు చెప్పినట్లుగా చెబుతున్నారు. ఆమె విషయంలో తాను బుద్దిగానే ఉన్నట్లుగా చెప్పాడట. తన పెళ్లి ప్రపోజల్ కు ఆమె ఓకే చెప్పటంతో ఆమెను ఏమీ చేయలేదని పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణంతోనే శ్రీనివాసరెడ్డి తరచూ వేములవాడకు వెళ్లేవాడని పోలీసులు గుర్తించారు. అయితే.. ఇతని గురించి తెలీని సదరు యువతి ఇతనితో చనువుగా ఉన్నట్లుగా తెలిసింది. శ్రీనివాసరెడ్డి పెళ్లి ప్రపోజల్ కు ఆ యువతి ఓకే చెప్పటంతో బతికిపోయింది. లేకుంటే.. మరో దారుణానికి ఒడిగట్టేవాడనటంలో ఎలాంటి సందేహం లేదు.