మరో వివాదం తెరపైకి వచ్చింది. కరుడుగట్టిన తీవ్రవాదులకు విధించిన ఉరిశిక్షలకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. పార్లమెంటు దాడి కేసులో అఫ్జల్ గురు.. ముంబయి పేలుళ్ల కేసుకు సంబంధించి అబ్దుల్ రజాక్ మెమన్ లకు విధించిన ఉరిశిక్షపై ఇప్పటికే ఉన్న భిన్న వాదనలకు తోడుగా తాజా విమర్శలు మరింత వేడి పుట్టించే అవకాశం ఉందని చెప్పొచ్చు.
వీరిద్దరికి విధించిన ఉరిశిక్షలు.. ఉరితీత కార్యక్రమం మొత్తం రాజకీయంతో కూడుకున్నవన్నది జస్టిస్ షా అభిప్రాయం. ఒక జాతీయ ఛానల్ లో మాట్లాడిన ఆయన.. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. మెమన్ ఉరితీత విషయంలో జాలి చూపించేందుకు అవకాశాలున్నా.. రాజకీయ కారణాలతో ఆ పని చేయలేదన్నది ఆయన అభిప్రాయంగా ఉంది.
మెమన్‌కు జాలి చూపించే విషయంలో అవకాశం ఉన్నా కూడా వాటిని విస్మరించిన విషయాన్ని ప్రస్తావించటమే కాదు.. న్యాయమూర్తుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న విషయాన్ని ప్రస్తావించారు.
మెర్సీ పిటీషన్ తిరస్కరించిన తర్వాత ఉరితీతకు రెండు వారాల గడువు ఉండాలని.. కానీ.. ఉరితీసే విషయంలో అలాంటి అంశాల్ని పరిగణలోకి తీసుకోవటాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. మెమన్ కేసులో న్యాయ నిబంధనల్ని పాటించలేదని అభిప్రాయపడ్డ షా.. అఫ్జల్ గురు కేసులో సుదీర్ఘ కాలం పాటు మెర్సీ పిటీషన్ ను పెండింగ్‌లో ఉంచటాన్ని ప్రస్తావించటం గమనార్హం. మొత్తంగా జస్టిస్ షా వ్యాఖ్యలతో ఈ ఇద్దరి ఉరి వ్యవహారం కొత్త చర్చకు తావిచ్చే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.