పాటిదార్ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని ఉద్యమించడం ద్వారా వార్తల్లో నిలిచిన గుజరాత్ నేత హార్దిక్ పటేల్ ఓ ఇంటివాడు కానున్నారు. పాటిదార్లకు విద్యా ఉద్యోగాల్లో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని కోరుతూ గుజరాత్‌లోని పాటిదార్ నాయకుడు హార్దిక్ పటేల్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. అలా ఎదిగిన ఈ గుజరాతీ ఉద్యమ నాయకుడు ప్రేమ పెళ్లి చేసుకోనున్నారు. అయితే, ఇది కుటుంబ సభ్యుల సమ్మతితోనే జరగనుంది.
తన చిన్ననాటి స్నేహితురాలిని జనవరి 27న వివాహం చేసుకోబోతున్నాడు. ఈ వివాహ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులతో పాటు 100 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారు. ఈ సందర్భంగా హార్ధిక్ తండ్రి భరత్ పటేల్ మాట్లాడుతూ.. తన కుమారుడు, కాబోయే కోడలు కింజల్ పారిక్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటున్నారు. వారిద్దరి ఇష్టం మేరకు ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేస్తున్నామని తెలిపారు. కింజల్ పటీదార్ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి అని.. ఇది కులాంతర వివాహం కాదని స్పష్టం చేశారు. ఆమె పూర్తి పేరు కింజల్ పారిక్ పటేల్ అని చెప్పారు. కింజల్ తో హార్ధిక్ కు పెళ్లి చేయబోతున్నామని 2016 మార్చి నెలలో ఆయన తల్లిదండ్రులు ప్రకటించిన విషయం తెలిసిందే.