భారత ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యనాయుడు ఎన్నికైన నేపథ్యంలో ఏపీ నుంచి ఎవరికి మంత్రి పదవి దక్కనుందనే చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోటాలో కేంద్రమంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఆ దిశగా బీజేపీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఉన్న రెండు కేంద్రమంత్రి పదవులు కూడా తెలుగుదేశంకే కేటాయించారు. ఏపీ నుంచి విమానాయనశాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఆ శాఖ పరిధులు దాటి సొంత రాష్ట్రం కోసం ఆయన ఏమి చేసినా దాఖలాలు లేవనే భావన పలువురిలో ఉంది. మరో మంత్రి అయిన సుజనా చౌదరి నిర్వహిస్తున్నశాఖ రాష్ట్రానికి పెద్దగా మేలు చేసేది కాదు. ఈ నేపథ్యంలో వెంకయ్యనాయుడును కీలకమైన శాఖ నుంచి దూరం చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లోటు చేశామనే భావన లేకుండా ఉండేందుకు రాష్ట్ర బీజేపీకి చెందిన వారికే కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వాలని అభిప్రాయం వినిపిస్తోందని అంటున్నారు.
పార్టీ అగ్రనేతగా ఉన్న వెంకయ్యనాయుడుకు హోదా మారేసరికి ఏపీకి మరో మంత్రిపదవిని ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానవర్గం దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు అవకాశం దక్కుతుందని అంటున్నారు. బీజేపీకి ఏపీ తరపున కేంద్రం మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే వెంకయ్యనాయుడు కూడా హరిబాబు పేరునే సూచిస్తారనే ప్రచారం ఉంది. హరిబాబు ఎప్పటినుంచో కేంద్రంలో మంత్రి పదవి కోసం ఎదురుచూస్తుండటాన్ని కూడా ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కేంద్రంలో హరిబాబుకు మంత్రి పదవి దక్కిన పక్షంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగానర్సాపరం ఎంపీ గోకరాజు గంగరాజు నియమితుల య్యె అవకాశం ఉంది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావ డానికి కొద్దిరోజుల ముందే గోకరాజు గంగరాజు పేరును వెంకయ్యనాయుడు అధిష్టానవర్గానికి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో ఉన్న ఇద్దరు బీజేపీ ఎంపీలకు చెరొక పదవి దక్కినట్లు అవుతుందని అంటున్నారు.
కాగా, వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సందర్భం ఎప్పడూలేదు. ఆయన కర్నాటక, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తూ వహిస్తున్నారు. అయినప్పటికీ వెంకయ్యనాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతగానే గుర్తింపు ఉంది. ప్రచారానికి తగ్గట్లుగానే ఆయన కూడా రాష్ట్ర వ్యవహారాలకు జాతీయ స్థాయిలో చురుకుగా వ్యవహరిసూ వచ్చారు. రాష్ట్రానికి సంబంధించి పురోగతిపై ఢిల్లీ పెద్దలతో చర్చించాలన్నా వెంకయ్యనాయుడు సహకారం ఏపీ సర్కారుకు ఎప్పుడూ ఉండేది. ప్రస్తుతం ఆయన పదోన్నతి పొందడంతో బీజేపీ తరుపున ఏపీకి మరో కేంద్రమంత్రి కావాలని, దాంతో కేం ద్రంపై సంప్రదింపులు సులభంగా చెప్పడం సాధ్యమవుతుందనే అభిప్రాయాన్నితెలుగుదేశం పార్టీకి కూడా వ్యక్తం చేస్తోంది.