మోడీ డ్రీం ప్రాజెక్టుల్లో గంగా శుద్ధి ఒకటి. గత పాలకుల నిర్లక్ష్యంతో భ్రష్ఠు పట్టిపోయి.. కాలుష్య కాసారంలా మారిపోయిన గంగా జీవనదిని ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేయాలని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు చాలా కచ్ఛితంగా ఉంది.
ఇందుకోసం భారీ ఎత్తున నిధులు సైతం కేటాయిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గంగానదిని కాలుష్యం చేస్తున్న ఒక ఫైవ్‌స్టార్ హోటల్ విషయంలో ప్రభుత్వం కరుకుగా వ్యవహరించింది. ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా.. కాలుష్య వ్యర్థాల్ని గంగలో కలపటంపై సీరియస్ అయ్యింది. తాజాగా హరిద్వార్‌లోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్‌ను సీజ్ చేశారు.
హోటల్ నుంచి వస్తున్న వ్యర్థజలాల్ని నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెప్పినప్పటికీ.. సదరు ఫైవ్‌స్టార్ హోటల్ తన తీరును మార్చుకోలేదు. దీంతో.. మండిపడిన అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఈ ఫైవ్‌స్టార్ హోటల్ (రాడిసన్ బ్లూ ఫైవ్‌స్టార్ హోటల్) ను సీజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులు తీసుకున్న ఇలాంటి చర్యల్ని మరింత ముమ్మరం చేయటం ద్వారా గంగా నదిని మరింత స్వచ్ఛంగా మార్చే వీలుంటుంది.