అనూహ్యమైన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ మధ్యన కాస్త తగ్గించారు కానీ.. మామూలుగా అయితే నాటకీయ పరిణామాలంటే ఆయనకు చాలా ఇష్టమని చెబుతారు. ఈ కారణంతోనే ఫాంహౌస్ కు వెళ్లే క్రమంలో గ్రామాల వద్ద కాన్వాయ్ ను ఆపటం.. దారిన పోయే దానయ్యలతో మాటలు కదపటం.. సమస్యల గురించి అడిగి తెలుసుకోవటం.. తనకు ఎప్పుడో పరిచయం ఉన్న వారిని గుర్తించి మరీ రోడ్డు మీద కారు ఆపి వారితో మాట్లాడటం.. ఫాంహౌస్ కు పిలిపించటం లాంటివెన్నో చేస్తుంటారు.
అలాంటి కేసీఆర్ కొద్దికాలంగా తన తీరుకు భిన్నంగా ఉంటున్నారు. కరోనా కారణంగా ఆయన చాలా పరిమితంగా మాత్రమే భేటీలు జరుపుతున్నట్లు చెబుతారు. అలాంటి ఆయన మంత్రి ఈటల నుంచి వైద్య ఆరోగ్య శాఖను తీసేసుకున్న తర్వాత.. తొలిసారి గాంధీ ఆసుపత్రికి వెళ్లి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అంతేకాదు.. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ డాక్టర్లు.. నర్సులు.. వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యల గురించి వివరిస్తూ వెంటనే రిపోర్టు పంపాలని ఆదేశించటం తెలిసిందే.
మొత్తంగా తన గాంధీ ఆసుపత్రి పర్యటనను సంచలనంగా మార్చటంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. గాంధీలోని కొవిడ్ అత్యవసర వార్డుల్లోకి ఎలాంటి పీపీఈ కిట్లు లేకుండా వెళ్లటం సాహసమేనని చెప్పాలి.అయితే.. ఇటీవల ఆయన పాజిటివ్ నుంచి నెగిటివ్ రావటం.. ఇమ్యునిటీ పవర్ ఎక్కువగా ఉండటంతో ఆయనకు ఎలాంటి సమస్యలు ఉండవన్న మాట వినిపిస్తోంది. అయితే.. తన వెంట తీసుకెళ్లిన ఇద్దరి గురించే ఇప్పుడు అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.
కేసీఆర్ ను విపరీతమైన భక్తి భావంతో కొలిచే మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావుతో పాటు.. తనకు థింక్ ట్యాంక్ గా ఉంటే సీఎస్ సోమేశ్ కుమార్ ను గాంధీకి వెంట తీసుకెళ్లారు. పేషెంట్లతో మాట్లాడే సమయంలో కేసీఆర్ ముఖానికి డబుల్ మాస్కు తప్పించి మరెలాంటి రక్షణ పరికరాల్ని ధరించలేదు. అంతేకాదు.. ఆయన వెంట ఉన్న సోమేశ్.. హరీశ్ లు డబుల్ మాస్కులు మాత్రమే ధరించారు. గాంధీ దవాఖానా లాంటి చోట.. అందునా ఐసీయూకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా పీపీఈ కిట్లను ధరించటం చాలా అవసరం. కానీ.. అలాంటిదేమీ లేకుండా వ్యవహరించిన సోమేశ్.. హరీశ్ ల తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. కేసీఆర్ మీద ఉన్న భక్తిభావం బాగానే ఉన్నా.. వారిద్దరికి కరోనా ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాహసాలు చేయాల్సిందే కానీ కరోనాతో కాదన్న విషయాన్ని వారిద్దరు ఎందుకు మిస్ అయినట్లు?