తెలంగాణలోని పాలక టీఆరెస్ లో కేసీఆర్ వారసత్వ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉందని కొందరంటారు.. అదేమీ లేదు, కేసీఆర్ తనయుడు కేటీఆరే ఆయనకు వారసుడు అని ప్రధాన పోటీదారు అయిన మేనల్లుడు హరీశ్ సహా అంతా బయటకు చెబుతుంటారు. కానీ.. ఉద్యమం మొదలు పెట్టిన నాటి నుంచి మామతో ఉంటూ రాజకీయంగా పండిపోయిన హరీశ్ రావు సామర్థ్యాలను ప్రతిపక్ష నేతలు సైతం మెచ్చుకుంటారు. స్వయంగా కేసీఆర్ కూడా ఇప్పటికే మేనల్లుడి సత్తా చూసి ముచ్చటపడుతుంటారు. అనేక వేదికల్లో హరీశ్ ను ఆయన ప్రశంసించిన సందర్భాలున్నాయి. కానీ.. వారసత్వం విషయానికొచ్చేసరికి కన్న ప్రేమను కాదనలేకో ఏమో కేటీఆరే పార్టీలో కింగ్ కావాలన్న కోరిక ఆయనలో కనిపిస్తుంటుంది. కేటీఆర్ కూడా ఇప్పటికే తన సత్తా నిరూపించుకున్నా.. రాజకీయ చాతుర్యం - సమస్యలను డీల్ చేయడం.. పాలనా సామర్థ్యం... విషయ అవగాహన.. ప్రజాదరణ వంటి ప్రతి అంశంలోనూ హరీశ్ కు ఫుల్ మార్క్సు వేస్తారు పరిశీలకులు. కానీ.. పార్టీలో మాత్రం కొద్దికాలంగా ఆయన్ను సైడ్ లైన్ చేసి కేటీఆర్ ను పైకి తెస్తున్నారన్న వాదన ఉంది. ఇలాంటి తరుణంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ర్యాంకుల్లో కేటీఆర్ వెనుకబడి.. హరీశ్ ముందంజ వేయడంలో మరోసారి ఈ ఇద్దరి మధ్య పోలికలపై చర్చ జరుగుతోంది.
మంత్రులు - ఎమ్మెల్యేల పనితీరుపై కేసీఆర్ చేయించిన సర్వేలో కేటీఆర్ గ్రాఫ్ బాగా పడిపోయినట్టు తేలింది. గతేడాది సర్వేలో కేటీఆర్ పనితీరుపై 70.6 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయగా… ఇప్పుడు ఆ శాతం 60.4కు పడిపోయింది. హరీష్ రావు గ్రాఫ్ మాత్రం 60.9 నుంచి 82.3 శాతానికి పెరిగిందని కేసీఆర్ సర్వే చెబుతోంది.
మరోవైపు తుమ్మల నాగేశ్వరరావుపైనా జనంలో వ్యతిరేకత అధికంగా ఉంది. కేసీఆర్ కేబినెట్ లో కేవలం ముగ్గురు మంత్రుల గ్రాఫ్ మాత్రమే పెరిగింది. ఎమ్మెల్సీ కోటాలో మంత్రులయిన కడియం - మహమూద్ ఆలీ - నాయిని నరసింహారెడ్డిని మినహాయిస్తే మిగిలిన 11 మంది గ్రాఫ్ పడిపోయింది.తుమ్మల నాగేశ్వరరావు గ్రాఫ్ 82 శాతం నుంచి 57.5 శాతానికి పడిపోయింది. మంత్రి చందులాల్ గ్రాఫ్ ఏకంగా 82. 4 నుంచి 34.4 శాతానికి పడిపోయింది. ఇంతగా ప్రజాదరణ కోల్పోయిన మంత్రి చందులాలే. పోచారం శ్రీనివాసరెడ్డి గ్రాఫ్ 45. 9 నుంచి 61 శాతానికి పెరిగింది. కేసీఆర్ గ్రాఫ్ 75. 7 నుంచి 96.7కు పెరిగింది. డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి ప్రజాదరణ 55 శాతం నుంచి 77.2 శాతానికి పెరిగింది. ప్రజాదరణ తగ్గుతున్న వారిని కేసీఆర్ మందలించారు. పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని కొద్దిమందిని హెచ్చరించినట్లు తెలిసింది. ఇక ముందటి కంటే ఎక్కువ ప్రజాదరణ కూడగట్టుకున్న వారికి అభినందనలు తెలిపారు. ఇదంతా ఎలా ఉన్నా హరీశ్ అభిమానులు మాత్రం దీంతో తెగ సంతోషపడుతున్నారట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/