ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు.. హరీశ్ రావులు. తిరుమలకు చేరుకున్న వారు ఆదివారం స్వామిని దర్శించుకున్నారు. హరీశ్ రావు ఫ్యామిలీతో స్వామివారిని దర్శనం చేసుకుంటే.. తుమ్మల మాత్రం ఫ్యామిలీని వెంట తీసుకురాలేదు. సంప్రదాయ వస్త్రధారణతో స్వామిని దర్శించుకున్న తర్వాత హరీశ్ ఫ్యామిలీ మెంబర్లతో ఫోటోలకు ఫోజులు ఇచ్చేయగా.. మంత్రి తుమ్మల మాత్రం నాలుగు మాటలు చెప్పారు.
ఏపీ సర్కారు మీదా అప్పుడప్పుడు విమర్శలు చేసే తుమ్మల నోటి నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వస్తాయన్న ఆసక్తితో చెవులు రిక్కించి విన్న వారికి తగ్గట్లే.. ఆయనో మాట చెప్పారు. స్వామిని దర్శించుకున్న సందర్భంగా శ్రీవారిని తాను కోరిన కోరిక గురించి చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కీలక బాధ్యతలు మోస్తున్న ఆయన.. స్వామి వారిని ఏం కోరుకొని ఉంటారన్న ఉత్సాహం చూపించిన వారికి తగ్గట్లే ఆయన మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల్లో ఈ సారి మంచిగా వానలు పడాలని.. రెండు రాష్ట్రాలు చక్కగా ఉండాలని.. నీళ్లతో కళకళలాడాలని కోరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు.
మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా.. స్వామిని కలిసినప్పుడు తెలంగాణ రాష్ట్రంతో పాటు.. ఏపీ రాష్ట్రం చక్కగా ఉండాలని.. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్లుగా చెబుతున్న తుమ్మల.. ఆ దిశగా.. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంశాల వారీగా ఇచ్చుపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే నిజంగానే ప్రజలంతా సంతోషంగా ఉంటారు కదా. నేతల చేతుల్లో ఉన్న విషయానికి కూడా స్వామి వారిని ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం ఉందా..?