సారీ చెప్పాల్సిందే - హరీష్‌రావు

Update: 2019-04-01 11:37 GMT
మన టైమ్‌ బాగోలేనప్పుడు అన్ని బంద్‌ చేసుకుని.. మన టైమ్‌ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం అలాంటి పరిస్థితినే ఎదుర్కుంటున్నారు తెలంగాణ మాజీ మంత్రి హరీష్‌రావు. కేసీఆర్‌ ఎదుగుదలలో, ముఖ్యమంత్రి కావడంలో కీలక పాత్ర వహించిన హరీష్‌రావుని.. కేసీఆర్‌ దూరం పెడుతున్నారు. ఆయనకు ఒక్క పదవి కూడా ఇవ్వలేదు. ప్రజలంతా.. హరీష్‌రావు రేపో మాపో వేరే పార్టీకి వెళ్లిపోతారని కూడా అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో హరీష్‌రావు బీజేపీలోకి వెళ్లిపోతున్నాడంటూ ప్రముఖ ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే.. చివర్లో ఏప్రిల్‌ ఫూల్‌ అంటూ క్యాప్షన్‌ కూడా ఇచ్చింది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్ట అంటించుకోవడానికి నిప్పు దొరకలేదని బాధపడ్డడాట వెనకటికి ఒకడు. అలా ఉంది ఇప్పుడు సదరు డైలీ పత్రిక పరిస్థితి. అసలే టైమ్‌ బాగోలేదు అనుకుంటే… తనపై ఇలాంటి వార్తలు ఏంటా అని హరీష్‌రావు ఒక్కసారిగా ఆ పత్రికపై సీరియల్‌ అయ్యారు.

            హరీష్‌రావు పార్టీ మారబోతున్నానని వచ్చిన వార్తల నిజం కాదని సదరు పత్రికే చెప్పినా… చివర్లో ఇచ్చిన ఏప్రిల్‌ ఫూల్ అనే క్యాప్షన్‌ని ఎంతమంది చదువుతారు. ఎందుకంటే.. నిజం నిద్రలోచేలోపే.. అబద్ధం ఊరు దాటేస్తుంది అనేది సామెత. ఇప్పుడు ఈ వార్త కూడా ఇలాగే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. అసలు హరీష్‌రావు పర్మిషన్‌ లేకుండా ఇలాంటి వార్తల్ని సదరు డైలీ పత్రిక అయినా ఎందుకు వేస్తుంది అనేది టీఆర్‌ఎస్‌ నేతల వాదన. ఇక సదరు వార్తపై స్పందించిన హరీష్ రావు.. ట్విట్టర్ వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంగ్లిషు పత్రిక నాపై ప్రచురించిన వార్త..  ఫేక్ న్యూస్‌కు అతిపెద్ద ఎగ్జాంపుల్‌. భారతదేశం మొత్తం ఫేక్ న్యూస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇలాంటి తరుణంలో తప్పుడు వార్తలను ప్రసారం చేయడం పద్ధతి కాదు. ఇటువంటి చిల్లర వార్తలను ఇంకెప్పుడూ ప్రచురించొద్దని మీడియా సంస్థలను కోరుతున్నాను. ఇదే సమయంలో.. తనపై తప్పుడు వార్తను ప్రచురించిన పేజీలోనే రేపు(మంగళవారం) క్షమాపణలు చెబుతూ మరో వార్తను ప్రచురించాలని డిమాండ్ చేస్తున్నాను అని హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా సదరు మీడియా సంస్థను హెచ్చరించారు. మరి దీనికి ఆ మీడియా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News