మామ చాలా హ‌ర్ట‌య్యాడంటున్న హ‌రీశ్ రావు

Update: 2017-05-25 11:25 GMT
టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ మ‌ఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్రంగా హ‌ర్ట్ అయ్యార‌ట‌. ఎందుకంటే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌ల్ల‌. ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది తెలంగాణ మంత్రి, సీఎం కేసీఆర్ మేన‌ల్లుడు హ‌రీశ్ రావు అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌, సీఎం కేసీఆర్ విలేక‌రుల స‌మావేశం, బీజేపీ నేత‌ల విమ‌ర్శ‌లు వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో హ‌రీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు తెలంగాణ రాష్ట్రాన్ని తక్కువ చేసి చూపినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధపడ్డారని హరీశ్‌ రావు తెలిపారు. పోరాటాల గడ్డపై ఏది పడితే అది మాట్లాడితే కుదురదని హరీశ్‌ రావు బీజేపీ నేతలను హెచ్చరించారు.

సీఎం అడిగిన ఏ ఒక్క అంశానికీ స‌రైన సమాధానం ఇవ్వకుండానే అమిత్ షా రాష్ట్రం విడిచి వెళ్లిపోయారని హ‌రీశ్ రావు అన్నారు. ముఖ్యమంత్రి ప్రశ్నలకు రాష్ట్ర బీజేపీ నేతలు స్పందించడం సంతోషకరమ‌ని అయితే...ముఖ్యమంత్రి విసిరిన సవాలులో ఏ ఒక్కదానికి రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానాలు చెప్పలేదన్నారు. రూ.లక్ష కోట్లు ఇచ్చామన్నది వాస్తవం కాదని పరోక్షంగా బీజేపీ నేతలు అంగీకరించారని హరీశ్‌రావు తెలిపారు. పన్నుల రూపేణా కేంద్రానికి తెలంగాణ ఇస్తున్నది రూ.50 వేల కోట్లు. కేంద్రం నుంచి రాష్ర్టానికి వస్తున్నది రూ.24 వేల కోట్లు మాత్రమేనన్నారు. దీంతో కేంద్రం..రాష్ర్టానికి ఇస్తుందా? రాష్ట్రం కేంద్రానికి ఇస్తుందా అనేది తేలిపోయిందన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. ఇతర రాష్ర్టాలు తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అధ్యయనం చేస్తున్నాయని హరీశ్‌ రావు స్పష్టం చేశారు.

 హైకోర్టును విభజించి తెలంగాణపై ఉన్న ప్రేమను నిరూపించుకోవాలని బీజేపీ నేతలకు హరీశ్‌రావు సవాలు విసిరారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టును ప్రకటించాలని బీజేపీని హ‌రీశ్ రావు డిమాండ్ చేశారు. అమిత్ షా రాష్ట్రానికి వచ్చినందుకు బీజేపీ పదేళ్లు వెనక్కి పోయిందని హ‌రీశ్ రావు ఎద్దేవా చేశారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ - ఉత్త‌ర‌ప్రదేశ్ సీఎం యోగి రాష్ట్రానికి వస్తే 25 ఏళ్లు వెనక్కి పోవటం ఖాయమని హరీశ్‌ రావు వ్యాఖ్యానించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News