తెలంగాణ రాష్ట్ర సర్కారులో కీలకమైన వ్యక్తులుగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ ను చెప్పాలి. అలాంటి ఈ ఇద్దరు తీరు భిన్నంగా ఉండటం గమనార్హం. మొన్నామధ్య ఖమ్మం జిల్లాలకు సంబంధించి పోలవరం ముంపు మండలాలు కొన్నింటిని ఏపీలో కలిపేయటం.. అందులోని ఐదు ఊళ్లను తెలంగాణకు తిరిగి ఇచ్చేస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు చెప్పినట్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పుకోవటం తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ చెప్పిన మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. రైతు ఎక్కడున్నా రైతేనని.. ఒక రైతు మరో రైతు నాశనమైపోవాలని అనుకోడని.. అతడి పొలం ఎండిపోవాలని అనుకోడని.. తన మాదిరే చల్లంగ ఉండాలని.. పచ్చటి పంటతో కళకళలాడిపోవాలని భావిస్తాడని చెప్పుకొచ్చారు. అందుకే.. ఏపీలోని రైతులు.. తెలంగాణలోని రైతులు చక్కగా ఉండేలా నిర్ణయాలు తీసుకోవాలని.. ప్రాంతాలు వేరైనా అంతా తెలుగు వాళ్లమే కదా.. ఇరుగుపొరుగు వాళ్లమే కదా అంటూ చాలానే మాటలు చెప్పారు.
కేసీఆర్ మాటల్ని విన్నోళ్లంతా మాగొప్ప సంతోషానికి గురయ్యారు. ఇరుగుపొరుగుతో సఖ్యతతో ఉండాలన్న ఆయన మాటల్ని స్వాగతించారు. నాడు కేసీఆర్ చెప్పిన మాటల్లో మరో కీలకమైన మాట కూడా ఉంది. తెలంగాణ ప్రాంతీయులంతా బతుకు.. బతకనివ్వు చందంతో ఉంటారని చెప్పారు. ఇప్పుడా ముచ్చటను కట్ చేసి.. ఆయన మేనల్లుడు కమ్ మంత్రి హరీశ్ రావు మాటల్లోకి వెళితే ఆయన ఆగ్రహం ఒకపట్టాన అర్థం కాదు.
పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకించటంపై మండిపడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి అడ్డుతగిలితే ఖబడ్డార్ అన్న ఆయన.. ఈ పథకాన్ని అడ్డుకోవటానికి చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారని.. జగన్ మూడ్రోజులు నిరసన చేస్తానని చెప్పటం దారుణంగా అభివర్ణించారు. ఆంధ్రాలో పార్టీలు వేరైనా తెలంగాణ ప్రయోజనాల్ని అడ్డుకోవటానికి అక్కడి నేతలంతా ఏకమవుతున్నారని ఆరోపించిన హరీశ్.. చంద్రబాబు.. జగన్ లకు హైదరాబాద్ లో ఆస్తులున్నాయని.. అయినా ఇక్కడి వారికి సాగునీరు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
ఇక్కడ పాయింట్ ఏమిటంటే.. మేనమామ ఆ మధ్య చెప్పిన రీతిలో ఇరుగుపొరుగు రాష్ట్రాలు నిత్యం పంచాయితీలు పెట్టుకునే కన్నా.. సమస్యలుంటే కూర్చొని చర్చల ద్వారా పరిష్కారం వెతకాలని. పాలమూరు ప్రాజెక్టు మీద ఏపీ అభ్యంతరాల్ని వినటం.. వాటికి సరైన సమాధానం చెబితే సరిపోతుంది కదా. భారీ సరిహద్దు ఉన్న ఏపీతో పంచాయితీలు సరికావన్న మేనమామ మాటను మేనల్లుడు వినలేదా? తెలంగాణ రాష్ట్రం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుకు ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తే.. వారి వాదనలోని తప్పుల్ని ఎత్తి చూపాలే కానీ.. హైదరాబాద్ లో ఆస్తులున్న చంద్రబాబు.. జగన్ లు తెలంగాణ గురించి ఆలోచించటం లేదని విమర్శించటంలో అర్థం లేదు. ఎవరికైనా ఎక్కడైనా ఆస్తులు ఉంటే.. ఆ ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడాలని చెప్పటం వితండమే అవుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. తప్పుల్ని ఎత్తి చూపే వారి మీద ఆగ్రహంతో వ్యాఖ్యలు చేసే కన్నా.. తప్పుల్ని సరి చేసుకుంటే సరిపోతుందిగా..?