గులాబీ దళపతి కేసీఆర్ మేనల్లుడు - తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఓవైపు పెద్ద ఎత్తున ముందస్తు హడావుడి కొనసాగతుండటం...మరోవైపు కీలక నిర్ణయాలన్నీ హరీశ్ ప్రయేమం లేకుండానే జరిగిపోతుండటం...తెలిసిన సంగతే. ప్రతిష్టాత్మకంగా సాగిన ప్రగతి నివేదన సభ హరీశ్ నీడ కూడా పడకుండానే సాగిపోయింది. అయితే, ఆ సభ విఫలమైనట్లు టాక్ రావడం, మరోవైపు ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో...ప్రజా ఆశీర్వాద సభ పేరుతోగులాబీ దళపతి కేసీఆర్ మరో సభకు శ్రీకారం చుట్టారు. అయితే, ఈ కీలక సభకు తన కుమారుడు కేటీఆర్ కు కాకుండా హరీశ్ రావుకు బాధ్యతలు అప్పగించారు. తద్వారా ఆయన సత్తాను గుర్తుచేసుకున్నారు.
అయితే, మామ ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతతో హరీశ్ రావులో రెట్టించిన ఉత్సాహం కనిపించిందని అంటున్నారు. హుస్నాబాద్ లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఆయన చేసిన కామెంట్లే ఇందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. హుస్నాబాద్‌లో హరీశ్ విలేకరులతో మాట్లాడుతూ గత ఎన్నికల సభను కూడా హుస్నాబాద్ నుంచే ప్రారంభించామని గుర్తు చేశారు.50 ఏండ్ల తర్వాత తండా వాసుల కలను నిజం చేస్తూ సీఎం కేసీఆర్ తండాలను గ్రామపంచాయతీలుగా మార్చారని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలే కాదు.. చెప్పనివి కూడా అమలు చేశామని హరీశ్ రావు తెలిపారు.ప్రాణహిత ప్రాజెక్టుకు కాంగ్రెస్ కనీసం అనుమతులు కూడా తీసుకురాలేదు. టీఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు తేవడమే కాదు.. 90 శాతం పనులు పూర్తి చేశామని తెలిపారు. రాబోయే శాసనసభ ఎన్నికల్లో 100 స్థానాల్లో టీఆర్ ఎస్ గెలుస్తుందని పేర్కొన్నారు. తద్వారా మామ ఇచ్చిన భరోసాతో ఆయన చెలరేగిపోతున్నారని అంటున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయవంతం అవుతుందనే నమ్మకంతో సీఎం ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ లో తొలి ఆశీర్వాద సభ నిర్వహిస్తున్నారని, ఇది ఇక్కడి ప్రజల అదృష్టమని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో నుంచి ప్రతి ఇంటి నుంచి ఇద్దరు లేక ముగ్గురు సభకు తరలిరావాలని కోరారు. కనీవినీ ఎరుగని రీతిలో తరలివచ్చి సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టాలని పిలుపునిచ్చారు. అంతకుముందు సిద్దిపేటలో హుస్నాబాద్ నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి జనసమీకరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ నెల 7న మధ్యాహ్నం నిర్వహించే బహిరంగసభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి సుమారుగా 50 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం గమనార్హం.