గడిచిన కొంతకాలంగా కేటీఆర్ వర్సెస్ హరీశ్ ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ కు పుల్ స్టాప్ పడిందా? అధిపత్య పోరులో హరీశ్ వెనుకబడిపోవటం.. కేటీఆర్ కు వారసత్వ పగ్గాలకు టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు ముగిసిన తర్వాత.. సరైన సమయం చూసుకొని కేటీఆర్ ను సీఎంను చేసి పాలనా పగ్గాలు ఆయనకు అప్పగిస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
అదే సమయంలో కేటీఆర్ ను సీఎంను చేస్తే.. కేసీఆర్ మేనల్లుడు హరీశ్ స్పందన ఏమిటి? అన్నది ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో కేటీఆర్.. హరీశ్ ల మధ్య అధిపత్య పోరు ఓ రేంజ్ కు చేరిందని.. పరిస్థితులు తనకు అనుకూలంగా లేని నేపథ్యంలో ఆయన కామ్ గా ఉన్నారన్న మాట బలంగా వినిపించింది. హరీశ్ వర్గానికి చెందిన నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. హరీశ్ వర్గానికి చెందిన నేతలకు కేసీఆర్ తాజాగా ప్రకటించిన 105 స్థానాల్లో ఎక్కువగా ఇవ్వలేదని.. తప్పనిసరి అభ్యర్థులకు మాత్రమే కేటాయించినట్లుగా చెబుతున్నారు. పార్టీలో మారుతున్న సమీకరణాలతో పాటు.. కొడుకు పట్టాభిషేకానికి తగ్గట్లుగా రంగం సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్ మూడ్‌ను గుర్తించిన నేతలు పలువురు.. హరీశ్ తో తమకున్న సాన్నిహిత్యాన్ని తగ్గించుకుంటూ ఇష్టం ఉన్నా లేకున్నా.. కేటీఆర్ దరికి చేరుతున్న వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటివేళ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హరీశ్. తనకు.. కేటీఆర్ కు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లుగా వస్తున్న వార్తలకు చెక్ చెప్పేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. తాను కేటీఆర్ నాయకత్వంలో పని చేయటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.కేటీఆర్ సీఎం అయితే.. ఆయన కింద పని చేయటానికి తాను సిద్ధమని చెప్పేశారు. దీంతో.. అధిపత్య పోరు నుంచి హరీశ్ తనకు తానుగా వైదొలిగినట్లుగా చెబుతున్నారు. దీంతో.. కేటీఆర్ పట్టాభిషేకానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ చురుగ్గా పాల్గొన్నారని.. ఐటీ మంత్రిగా ఆయన తన ముద్రను వేశారని.. అలాంటప్పుడు కేటీఆర్ నాయకత్వంలో పని చేయటానికి తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. యూపీలో ఎలా అయితే.. ములాయం వారసత్వాన్ని అఖిలేశ్ స్వీకరించారో.. అదే రీతిలో కేటీఆర్ సీఎం పగ్గాల్ని చేపడితే తనకు ఎలాంటి అభ్యంతరం ఉండదన్న మాట హరీశ్ నోటి నుంచి రావటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమిస్తూ తమ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకుంటే.. దానికి తాను తలొగ్గుతానని హరీశ్ స్పష్టంగా చెప్పేశారు. ఈ మాటతో టీఆర్ఎస్ లో అధిపత్య పోరు వాదనలకు తెరపడుతుందా? అన్నది చూడాలి.