హర్యానాకు చెందిన రిషు అనే యువతి 2014 స్టేట్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇంకేముంది ఈమె పెద్ద సెలబ్రెటీ అయిపోయి ఉంటుంది, పెద్ద పెద్ద కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నారా? అలా అనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుంది. ఈ స్టేట్ బాక్సింగ్ చాంపియన్, గోల్డ్ మెడలిస్ట్ ... ప్రస్తుతం అంట్లు తోముకుంటూ బ్రతుకీడుస్తుంది... పనిమనిషిలా బ్రతుకుతుంది! కేవలం పేదరికమే ఈ గోల్డ్ మెడలిస్ట్‌ని పనిమనిషిని చేసింది. యువ అథ్లెట్ ఉన్నత జీవితాన్ని ఆదిలోనే తుంచేసింది! గత డిసెంబర్‌లో జరిగిన నేషనల్ చాంపియన్ షిప్ లో హర్యానా తరపున పోటీ చేసిన రిషు... బాక్సింగ్‌లో ఎన్ని విజయాలు సొంతం చేసుకుంది!
గతేడాదే రిషు తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో... ఉన్న సోదరుడితో కలిసి బ్రతుకీడుస్తూ... ఉదయం వేళల్లో సమీపంలోని ఇళ్లలో పాచిపనులు చేసుకుని ఆ తర్వాత స్కూలుకు వెళ్తోంది. మరలా సాయంత్రం స్కూలు నుంచి వచ్చి తనకిష్టమైన బాక్సింగ్ ప్రాక్టీసు చేస్తోంది. స్కూలు ఫీజు ఖర్చుల కోసమే పాచిపనులకు వెళ్తున్నట్లు చెబుతోంది ఈ పదో తరగతి చదువుతున్న చాంపియన్. కిరాణా కొట్టులో పనిచేసే తన సోదరుడి సంపాదన సరిపోకే తాను కూడా పనిచేయాల్సి వస్తుందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రిషు విజ్ఞప్తి చేస్తోంది. బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను దెబ్బ కొడుతూ... వారి దెబ్బలనుండి తప్పించుకుని నిలవగలిగింది కానీ... విధి తో ఆడిన ఆటలో మాత్రం గట్టి దెబ్బలే తింటోంది రిషు! ఇప్పటికైనా స్పర్శజ్ఞానం కోల్పోయింది అనే విమర్శను ఎదుర్కొంటున్న ప్రభుత్వం రెండు కళ్లు తెరిచి ఈమెను ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు!