ఏపీలో ప్రజా సాధికార సర్వే ఎన్ని ఇబ్బందులతో సాగిందో తెలిసిందే. నెట్ వర్కు లేక... టెక్నికల్ గా మరెన్నో ఇబ్బందులతో సాగించిన ఈ సర్వేను చివరకు మమ అనిపించారు. కానీ.. చంద్రబాబు దీన్ని బాగా ప్రచారం చేసుకోవడంతో మిగతా రాష్ర్టాలు ఈ విషయంలో చంద్రబాబు సహకారం తీసుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ‘ప్రజా సాధికార సర్వే’ తరహా ప్రాజెక్టును తమ రాష్ట్రంలో కూడా చేపట్టేందుకు హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన ఈ-ప్రగతి - స్మార్ట్ పల్స్ సర్వేల అమలులో ఏపీ సహకారాన్ని కోరింది. సాంఘిక సంక్షేమ కార్యక్రమాల అమలులో పూర్తి పారదర్శకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవడం ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయడంలో పరస్పరం సహకరించుకొనేందుకు వీలు కల్పించే ఒక అవగాహన ఒప్పందంపై ఆంధ్రప్రదేశ్ - హర్యానా రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది.
ఈ సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మన చంద్రబాబును తెగ పొగిడారు. పాలనా వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో - సమర్థవంతంగా వినియోగించుకొనే విషయంలో దేశంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆద్యుడని ఆకాశానికెత్తేశారు. అవినీతి కారణంగా, పారదర్శకత లోపించడం వల్ల హర్యానా రాష్ట్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుందోని... అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వాడుకొని వీటిని అధిగమించడంలో ఏపీ సహకారాన్ని కోరుతున్నామని వివరించారు.
అయితే... ఏపీలో విపక్షాలు దీనిపై సెటైర్లు వేస్తున్నాయి. హర్యాణా ముఖ్యమంత్రికి ఏపీలో అవినీతి గురించి పూర్తిగా తెలిసినట్లు లేదని అంటున్నారు. అంతేకాదు.. ప్రజాసాధికారిక సర్వే కూడా విఫలమైందన్న సంగతి తెలియక చంద్రబాబు మాయలో అయన పడ్డారంటున్నారు. చంద్రబాబు మాటలు నమ్మితే అంతేనంటూ ఎద్దేవా చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/