భార్య వంట తిన‌ని భ‌ర్త‌కు హైకోర్టు విడాకులు

Update: 2018-05-30 08:10 GMT
విడాకుల‌కు సంబంధించి చాలానే కేసులు విని ఉంటారు. కానీ.. ఈ కేసు చాలా భిన్న‌మైంది. ఊహించ‌నిరీతిలో ఉండే ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. త‌న భార్య‌ను న‌ల్ల‌గా ఉందంటూ అదే ప‌నిగా మాట‌లు అనే భ‌ర్త‌.. భార్య చేసిన వంట‌ను తిన‌నందుకు విడాకులు మంజూరు చేసిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ చిత్ర‌మైన కేసు వివ‌రాల్లోకి వెళితే.. హ‌ర్యానాలోని మ‌హేంద‌ర్ గంజ్ కు చెందిన ఒక మ‌హిళ‌కు కొన్నేళ్ల క్రితం పెళ్లి జ‌రిగింది. ఆమె న‌ల్ల‌గా ఉన్న కార‌ణంగా భ‌ర్త ఆమెను న‌ల్ల‌మ‌బ్బు అంటూ వేధించేవారు. అంతేకాదు.. ఆమెను దూరంగా పెట్టి.. వంట కూడా చేయ‌నిచ్చేవాడు కాదు. ఒక‌వేళ‌.. ఆమె ప్రేమ‌తో భోజ‌నం వండినా తినేందుకు ఇష్ట‌ప‌డేవాడు కాదు. దీంతో.. విసుగు చెందిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

దీంతో మ‌హిళ తండ్రి.. అల్లుడి ఫ్యామిలీతో మాట్లాడి.. ఈ వివాదాన్ని స‌మ‌సిపోయేలా చేయాల‌ని ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యారు. ఇదిలా ఉంటే..  త‌మ కొడుక్కి మ‌ళ్లీ పెళ్లి చేస్తామంటూ బెదిరించ‌టంతో బాధిత మ‌హిళ‌.. ఆమె కుటుంబ స‌భ్యులు కోర్టు దృష్టికి ఈ ఉదంతాన్ని తీసుకెళ్లారు. భార్య శ‌రీర రంగును కించ‌ప‌రుస్తూ మాట్లాడిన భ‌ర్త తీరును కోర్టు తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. కేసును పూర్తిగా ప‌రిశీలించిన మీద‌ట భార్య కోరిన రీతిలో విడాకులు మంజూరు చేస్తూ సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేసింది.


Tags:    

Similar News