ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయ్యిందా ? వచ్చే ఏడాది ఏప్రిల్-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పేశారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని రద్దుచేయించాలని లేదా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపటమే ధ్యేయంగా రఘురాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంపీ ఎన్నిప్రయత్నాలు చేస్తున్నా అవేవీ ఫలించటంలేదు.
అందుకనే ఇపుడు తాను కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమని చెప్పేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మొదట కొందరితో రాజీనామాలు చేయిస్తారట. ఆ తర్వాత మూకుమ్మడి రాజీనామాలు చేస్తారట. ఆ తర్వాత అసెంబ్లీని రద్దుచేస్తారని ఎంపీ జోస్యం చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందని అన్నారంటే సుమారుగా ఫిబ్రవరి ప్రాంతంలోనే అసెంబ్లీని రద్దుచేసుకుని ముందస్తుఎన్నికలకు జగన్ సిఫారసు చేయాల్సుంటుంది.
మూడుముక్కలాట ఆడటం తప్ప ఈ మూడున్నరేళ్ళల్లో జగన్ చేసిందేమీ లేదని ఎంపీ తేల్చేశారు. మూడురాజధానులకు మద్దతుగా మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ రాజీనామాలను ప్రకటించిన విషయం తెలిసిందే.
జగన్ అనుమతిస్తే వెంటనే రాజీనామా చేసి మూడురాజధానులకు మద్దతుగా ఉద్యమంలోకి వెళతానని ధర్మాన ప్రకటించారు. అయితే ఇదే విషయమై జరిగిన నాన్ జేఏసీ సమావేశంలో కరణం తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్ కు అందించిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం రోజులవుతున్నా మళ్ళీ ఎలాంటి చడీచప్పుడు వినబడలేదు.
జగన్ బెయిల్ ఎప్పుడు రద్దయి జైలుకు వెళ్ళేది, ప్రభుత్వం ఎప్పుడు రద్దయ్యేది, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగుతుందనే విషయాలపై జోస్యం చెప్పిన ఎంపీ తాను ఎంపీగా ఎప్పుడు రాజీనామా చేసేది ? వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీచేస్తారా ? ఏ పార్టీ తరపున పోటీచేస్తారో ? ఏ నియోజకవర్గం నుండి పోటీచేసేది కూడా చెబితే బాగుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.