సెకండ్ డోస్ గురించి పెద్దగా పట్టించుకోలేదట .. వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం

Update: 2021-10-21 08:33 GMT
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కరోనా మహమ్మారిని అడ్డుకోవాలంటే మన ముందున్న ఏకైక మార్గం వ్యాక్సిన్. కరోనా కట్టడికి వ్యాక్సిన్ మాత్రమే శ్రీరామ రక్ష అని నిపుణులు పదే పదే చెప్పుతున్నారు. ముఖ్యంగా రెండు డోసుల వాక్సిన్ వేసుకున్న వాళ్లు కరోనా నుంచి 99 శాతం రక్షణ పొందుతున్నారని సర్వేలు తేల్చాయి. అయితే, ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ మంది వాక్సిన్ తీసుకొని వారే ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు.

అంతేకాక మొదటి డోస్ మాత్రమే తీసుకున్న వారిలో 30 శాతం మందికి కరోనా వస్తోందని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3 కోట్ల డోసులు సరఫరా చేశారు. 75 శాతం మందికి మొదటి డోస్ ఇవ్వగా.. 39 శాతం మందికి రెండో డోస్ పూర్తైంది. ఇంకా 36 లక్షలకు పైగా రెండో డోసు తీసుకోవాల్సినవారు ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 50 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఇంకా ఒక్క డోసు వ్యాక్సిన్ కూడా తీసుకోనివారు ఉన్నారు. వీరికోసం స్పెషల్ డ్రైవ్‌ చేపడుతోంది వైద్యశాఖ.

ఇక, రష్యా, యూకేలో కరోనా మళ్లీ బుసలు కొడుతుంది. వ్యాక్సిన్‌ తీసుకొని వారే టార్గెట్‌ గా అటాక్‌ చేస్తోంది. దీంతో అక్కడా మరణాలు పెరుగుతున్నాయి. ఆ పరిస్థితి తెలంగాణలో రాకుండా ఉండేందుకు అందరికీ వ్యాక్సిన్ అందించే విధంగా వైద్యారోగ్యశాఖ దృష్టి సారించింది. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో భార‌త్ అరుదైన ఘ‌న‌త‌ను సాధించింది. 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించిన దేశంగా నిలిచింది. ఇప్ప‌టివ‌ర‌కు చైనా మాత్ర‌మే వంద కోట్ల డోసుల వ్యాక్సిన్ల‌ను వినియోగించింది. దేశంలో మొద‌ట నెమ్మ‌దిగా ప్రారంభ‌మైన వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం కొన్ని నెల‌ల‌కే పుంజుకుంది.  

దేశంలో ఈ ఏడాది జనవరి 16 నుంచి హెల్త్ కేర్ సిబ్బందికి వ్యాక్సినేష‌న్ కార్యక్రమం ప్రారంభించారు. అనంత‌రం క‌రోనా ఫ్రంట్ లైన్ యోధులు అంద‌రికీ ఇవ్వ‌డం మొద‌లు పెట్టారు. దేశంలో ఫిబ్రవరి 19న‌ కోటి డోసుల వ్యాక్సిన్లు వినియోగించారు. ఏప్రిల్ 11న‌ 10 కోట్ల డోసులు వినియోగించిన దేశంగా భార‌త్ నిలిచింది. ఈ ఏడాది జూన్ 12న‌ 25 కోట్ల డోసులు, ఆగస్టు 6న‌ 50 కోట్ల డోసులు, సెప్టెంబర్ 13న మొత్తం 75 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింది. నేటితో 100 కోట్ల డోసుల వినియోగం పూర్త‌యింద‌ని కొవిన్ పోర్ట‌ల్‌ లో పేర్కొన్నారు.
Tags:    

Similar News