ఒకవైపు చినుకు కోసం తహతహలాడుతున్న పరిస్థితి. మరోవైపు.. ఈ పాడు వర్షం తమను ఇంకెంత కాలం వేధిస్తోందంటూ మండిపాటు. ఇదీ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దుస్థితి. ఏపీలో గత వారం రోజులుగా కొన్ని జిల్లాల్లో (ప్రధానంగా చిత్తూరు.. నెల్లూరు) భారీ వర్షాలు కురిస్తే.. ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతంలోనూ వర్షం జాడే లేని దుస్థితి. ఇక.. వారం రోజులుగా ఏపీలోని పలు జిల్లాల్లో (సీమతో పాటు ప్రకాశం.. గుంటూరు.. కృష్ణా.. గోదావరి జిల్లాలు) వర్షం జోరుగా కురిసింది.
ఇక.. చిత్తూరు.. నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీకి భారీగా నష్టం వాటిల్లింది. ఏపీ సర్కారు అంచనా ప్రకారం.. భారీ వర్షాల కారణంగా ఏపీకి రూ.3వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని.. తమను ఆదుకోవాలని కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు కోరింది. వెనువెంటనే రూ.వెయ్యి కోట్ల సాయాన్ని అందించాలని కోరింది. ఈ మేరకు ఏపీ సర్కారు.. కేంద్ర హోం.. వ్యవసాయ శాఖలను అభ్యర్థించింది. వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా 35 మంది మృత్యువాత పడ్డారని.. 1865 కిలోమీటర్ల మేర రహదారులకు భారీగా నష్టం వాటిల్లింది.
భారీ వర్షాలు నెల్లూరు జిల్లాను తీవ్రస్థాయిలో దెబ్బ తీశాయి. నెల్లూరు తర్వాత భారీ వర్షాల కారణంగా చిత్తూరు.. కడప జిల్లాలు పెద్ద ఎత్తున ప్రభావితం అయ్యాయి. ఇక.. ఉభయ గోదావరి జిల్లాల్లో పంట నష్టం పెద్ద ఎత్తున ఉంది. కృష్ణా జిల్లాలోనూ పంట నష్టం భారీగా చోటు చేసుకుంది. వర్ష తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. ఒక్క గురువారం నాడే ఏపీలోని 95 కేంద్రాల పరిధిలో కనిష్ఠంగా 200 మిలీమీటర్ల నుంచి 657 మిల్లీమీటర్ల మేర వర్షం కురిసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇక.. నెల్లూరు జిల్లాలోని జాతీయ రహదారికి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జిల్లాలోని మనుబోలు వద్ద నేషనల్ హైవే 16కు భారీ గండి పడింది. ఈ గండి లోతు 30 అడుగుల మేర ఉందని చెబుతున్నారు. కొన్ని మీటర్ల మేర ఈ గండి పడటంతో.. దీన్ని యుద్ధప్రాతిపదికగా పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గండి కారణంగా నెల్లూరు.. చెన్నై జాతీయ రహదారిలో ప్రయాణించే వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. ఈ మార్గాన్ని తక్షణమే పునరుద్దరించాల్సి ఉంది. భారీ వర్షాల కారణంగా దాదాపు 26వేల మందిని పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు.