లాక్ డౌన్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాగూ వర్క్ ఫ్రం హోమే. పిల్లలకు స్కూళ్లు లేవు. అందరికీ సెలవులే. ఈ అపార్ట్ మెంటులో కట్టుకదలకుండా ఎన్నాళ్లని ఉంటాం... మాకు అనుమతి ఇస్తే హాయిగా ఇంటికెళ్లి కుటుంబ సభ్యులతో గడుపుతాం. జీవితంలో ఎపుడూ దొరకని సమయం దొరికింది. వెసులుబాటు ఉంది. అందరూ కలిసుండే అవకాశం వచ్చింది... దయచేసి పంపండి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సంక్రాంతి సెలవుల్లో హైదరాబాదు ఖాళీ చేసినట్టు చేసి వెళ్లిపోతాం అని ప్రతి ఒక్కరూ పరితపిస్తున్నారు. చివరకు ఎట్టకేలకు వారి కోరిక ఫలించి తెలంగాణ ప్రభుత్వం... రండి పాసులిస్తాం అని పేర్కొంది. దీంతో ఎగిరి గంతేసిన జనం లక్షల్లో పాసుల కోసం ఎగబడ్డారు.
కొన్ని గంటల్లోనే తెలంగాణ పోలీసు సైటు హ్యాంగ్ అయిపోయేంత ట్రాఫిక్ వచ్చేసింది. దీంతో సైటును ఆపేశారు. కానీ కొన్ని గంటల తర్వాత మళ్లీ పాసులు జారీ చేస్తాం ఓపిక పట్టండి అని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. కానీ ఇంతలో ఏపీలో సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంతూళ్లకు వస్తున్న ఏపీ ప్రజలకు విజ్జప్తి చేశారు. ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండండి. మీకు అదే క్షేమం అని సూచించారు. వలస కూలీలకు మాత్రం కేంద్రం ఆదేశాల ప్రకారం అనుమతిస్తాం. వారిని క్వారంటైన్ లో పెట్టి తర్వాత ఇంటికి పంపిస్తాం. దయచేసి మిగిలిన వారు సహకరించాలని ప్రభుత్వం కోరుతోంది. మీ సహకారం ఉంటేనేనే కరోనాపై విజయం సాధ్యమని జగన్ సర్కారు చెబుతోంది.
అయితే, సొంతూరికి వెళ్లాలనుకునే వారికి ఏపీ రిక్వెస్ట్ పెద్ద డిజప్పాయింట్ మెంట్ మిగిల్చింది. ఇక్కడ పోలీసులు పాసులిస్తామంటుంటే... మీరు రాకండి అని చెప్పొద్దు ప్లీజ్ అని వేడుకుంటున్నారు. మా ఇంట్లోకెళ్లి బుద్ధిగా పెద్ద వాళ్లతో గడుపుతాం అని రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.