యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలంటూ ఆ దేవ పౌరులు ఇచ్చిన తీర్పు పుణ్యమా అని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు తీవ్ర నష్టానికి గురైన సంగతి తెలిసిందే. తమ ఓటుతో తమ దేశ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బేసుకునేలా చేసుకున్నారు బ్రిటీషర్లు. ఇదిలా ఉంటే.. వందల కోట్ల మందిని ప్రభావితం చేసిన బ్రెగ్జిట్ కారణంగా లాభ పడినోళ్లు ఉన్నారా? అంటే చాలా తక్కువనే చెప్పాలి.
ఒకవేళ లాభపడినా అది స్వల్పమనే అనుకుంటారు. కానీ.. లండన్ కు చెందిన 57 ఏళ్ల క్రిస్పిన్ ఓడే మాత్రం విపరీతంగా లాభపడ్డాడు. లండన్ కు చెందిన ప్రముఖ హెడ్జ్ ఫండ్ సంస్థ బాస్ అయిన క్రిస్పిన్.. బ్రెగ్జిట్ కారణంగా భారీగానే లాభపడ్డాడు. బ్రెగ్జిట్ కు బ్రిటన్ దేశస్తులు అనుకూలంగా ఓటు వేస్తారని బలంగా నమ్మాడు. వాస్తవానికి పలు మీడియా సంస్థలు సైతం.. బ్రెగ్జిట్ కు వ్యతిరేకంగానే ఓటు వేస్తారంటూ అంచనాలు వ్యక్తం చేశారు. దీనికి విరుద్ధంగా నిర్ణయం తీసుకుంటూ బంగారం మీద భారీగా ఇన్వెస్ట్ చేశారు.
బ్రెగ్జిట్ ఫలితాలు వెలువడటం.. క్రిస్పిన్ అనుకున్నట్లే ఎగ్జిట్ కు అనుకూలంగా బ్రిటన్ ఓటర్లు ఓటేయటంతో పౌండ్ విలువ 31 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయి.. బంగారం రేటుకు రెక్కలు వచ్చాయి. దీంతో.. క్రిస్పిన్ కు వచ్చిన లాభం మన రూపాయిల్లో ఏకంగా 2వేల కోట్లకు పైనే ఉంటుందని చెబుతున్నారు. చూస్తుంటే మనోడ్ని బెట్టింగ్ బంగార్రాజు అంటే సరిపోతుందేమో.