పత్రికల్లో భారీ ప్రకటనలు.. ఆర్టీసీ బస్సుల నిండా యాడ్స్ ఇచ్చే ముస్లిం మహిళగా ఆమెను ఎవరైనా చప్పున గుర్తిస్తారు. ఆమె కంపెనీ.. ఆమె పేరు పెద్దగా రిజిస్టర్ కాకున్నా.. ఆమె ఫోటోను చూసినంతనే.. అవును కదా.. ఈమెను చాలాసార్లు చూశామన్న మాట పలువురి నోటి నుంచి వినిపిస్తుంటుంది. అలాంటి ఆమెకు సంబంధించిన యవ్వారాల్లోకి వెళ్లే కొద్దీ షాకుల మీద షాకులు తినటం ఖాయం.
ప్రస్తుతం ఢిల్లీలో అరెస్ట్ అయి.. సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న ఆమే.. హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేతగా తనను తాను చెప్పుకునే నౌహీరా షేక్ ఓ పెద్ద మిస్టరీ. ప్రస్తుతం వందల కోట్ల టర్నోవర్ చేస్తున్నట్లు చెప్పే ఆమె గ్రూప్ లోని 15 కంపెనీలకు ఆమే అనని. మరింత షాకింగ్ విషయం ఏమంటే.. ఆమె అన్ని వ్యాపారాలు చేస్తున్నట్లు చెబుతున్నా.. వాటికి సంబంధించిన పత్రాలు ఏమీ లేకపోవటంతో పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.
పోలీసుల విచారణలో షాకింగ్ అంశాలు వారి దృష్టికి వచ్చాయి. హీరా గ్రూపు వార్షిక టర్నోవర్ ఆరేళ్లలో వందల రెట్లు పెరిగినట్లు గుర్తించారు. ఎనిమిదేళ్ల కిందట అంటే.. 2010-11లో కేవలం రూ.27లక్షలుగా ఉన్న ఆమె గ్రూపు టర్నోవర్.. 2016-17 నాటికి రూ.800 కోట్లకు చేరుకోవటం విశేషం. ఆమెకు చెందిన కంపెనీల లావాదేవీలు.. వాటి డాక్యుమెంట్లను ఐటీ విభాగానికి.. ఆర్వోసీకి ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తించారు.
పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతుందన్న ఆరోపణలు ఎదుర్కొనే నౌహీరా.. తనను తన మూడో భర్త మోసం చేశాడని చెప్పటం మరింత అవాక్కు అయ్యేలా చేస్తుంది. ఇక.. ఆమె ఏం చేస్తుందంటే.. బంగారం వ్యాపారం చేస్తారని చెబుతారు. ఒకవేళ.. అదేనిజమైతే.. ఆమె టర్నోవర్ ప్రకారం చూస్తే.. దాదాపు టన్ను బంగారం బిజినెస్ చేయాలి. అదేమాత్రం సాధ్యం కాదని చెబుతున్నారు. ఆమె ఏం చేస్తారు? ఇంత భారీ టర్నోవర్ ఎలా సాధ్యమన్నది తేలాల్సి ఉంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మరో భారీ షాక్ తప్పదు. ఏపీలోని తిరుపతికి చెందిన నౌహీరో షేక్ తండ్రి సాధారణ కూరగాయల వ్యాపారిగా చెబుతారు. ఆమె మాజీ భర్త సైతం కూరగాయాల వ్యాపారం చేసేవారని చెబుతారు. కేవలం టెన్త్ క్లాస్ వరకే చదివిన నౌహీరా.. ఆమె పేరుకు ముందు డాక్టర్ బిరుదును తగిలించుకున్నారు. ఒక దుబాయ్ వర్సిటీ ఆమెకు డాక్టరేట్ ఇచ్చిందని చెబుతారు. దీనిపైనా విచారణ జరుగుతోంది.
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ లో ఉండే ఆమె.. చిన్న చిన్న వ్యాపారాలతో మొదలెట్టి.. 2010లో హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ను ఏరపాటు చేశారు. ఓవైపు వ్యాపారంతో పాటు.. మరోవైపు ఇండియా ఉమెన్ హెల్ప్ లైన్ సెక్రటరీగా చెప్పుకునే ఆమె వ్యవహారాలపై పోలీసులు ఇప్పుడు లోతుగా విచారిస్తున్నారు. ఆమె చేసే భారీ టర్నోవర్ ఎలా సాధ్యమన్నది ఇప్పుడు పోలీసుల ముందు పెద్ద సవాలుగా మారిందని చెప్పక తప్పదు.