దేశంలో తొలిసారి హెలికాప్టర్ సర్వీసులు..ఒక్కో టికెట్ ధర ఎంతంటే ?

Update: 2020-07-30 09:30 GMT
మనదేశంలో ఇప్పటివరకు కార్ సర్వీసులు , బస్సు సర్వీసులు , విమాన సర్వీసులు చూసాం. కానీ , హెలికాప్టర్ సర్వీసులు లేవు . హెలికాప్టర్  సర్వీస్ కేవలం ప్రభుత్వ అధికారులకి , అలాగే బిజినెస్ మ్యాన్ లకి ,సొంతగా హెలికాప్టర్ కొనుక్కునే వారికీ మాత్రమే ఆ సదుపాయం ఉంటుంది. కానీ ,తాజాగా హెలికాప్టర్ సర్వీసులు కూడా ప్రారంభమైయ్యాయి. హెలిక్యాప్టర్లు ఇక ఆకాశంలో చక్కర్లు కొట్టనున్నాయి. పవన్ హన్స్ కంపెనీ తాజాగా మొట్టమొదటిసారిగా హెలిక్యాప్టర్ సర్వీసులను ప్రారంభించింది.  ఇకపై  ప్రయాణికులు కూడా  హెలికాప్టర్లలో ఎక్కి  తిరగొచ్చు. ఈ సర్వీసులు  ఉత్తరఖండ్‌ లోని డెహ్రాడూన్- న్యూ తెహ్రీ- శ్రీనగర్ - గౌచర్ రూట్ ‌లో  అందుబాటులో ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వపు ఉడాన్ స్కీమ్‌ లో భాగంగా పవన్ హన్స్ ఈ హెలికాప్టర్ సర్వీసులు తీసుకువచ్చింది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింఘ్ ఈ విషయాన్ని ట్విట్టర్ లో తెలిపారు.  ఉత్తరఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింఘ్ రావత్, హర్దీప్ సింఘ్ సంయుక్తంగా ఈ హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. ఈ సర్వీసుల వల్ల ఉత్తరఖండ్‌ లోని కొండ ప్రాంతాల్లో ఏరియల్ కనెక్టివిటీ పెరగబోతుంది. అలాగే, ప్రయాణ సమయం కూడా 25 నిమిషాల వరకు తగ్గిపోనుందట. ఛార్ ధమ్ యాత్రికులకు కూడా  ఈ హెలికాప్టర్ సర్వీసుల వల్ల అతి తక్కువ సమయంలోనే యాత్ర ని ముగించుకునే అవకాశం ఉంది.

ఇక, పవన్ హన్స్ సంస్థ వారంలో మూడు సార్లు  ఈ హెలికాప్టర్ సర్వీసులు నడుపనుంది. ఉడాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీకి వియబిలిటీ గ్యాప్ ఫండింగ్‌ ను అందిస్తుంది. అంటే హెలికాప్టర్ టికెట్ ధర కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రయాణించాలంటే ఒక్కో సీటుకు రూ.2,900 చెల్లిస్తే సరిపోతుంది.
Tags:    

Similar News