పొలిటికల్ హీరోయిన్లు.. భారీ స్థాయిలో ఆస్తులు!

Update: 2019-04-09 05:20 GMT
రాజకీయాల్లోకి వచ్చిన హీరోయిన్లు అత్యంత భారీ స్థాయిలో తమ ఆస్తులను డిక్లేర్డ్ చేస్తూ ఉండటం విశేషం. వీరి సినీ గ్లామర్ ను ఉపయోగించుకునేందుకు పొలిటికల్ పార్టీలు వీళ్లను రాజకీయాల్లోకి తీసుకొచ్చాయి. అంతేగాక ఎంపీలుగా పోటీ చేయించాయి. ఈ సారి ఎన్నికల బరిలో కొందరు ప్రముఖ హీరోయిన్లు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు.

జయప్రద - హేమమాలిని - ఊర్మిల వంటి అలనాటి స్టార్ హీరోయిన్లు ఈ సారి ఎంపీలుగా పోటీలో ఉన్నారు. వీరిలో జయప్రద - హేమమాలినిలు బీజేపీ తరఫు నుంచి - ఊర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీలో ఉన్నారు. వీరిలో ఊర్మిల న్యూ కమర్. హేమ - జయలు పాత వాళ్లే.

ఇక ఆస్తుల విషయానికి వస్తే వీరు తమ సత్తా ఏమిటో చూపిస్తూ ఉన్నారు. తన ఎన్నికల అఫిడవిట్ లో హేమమాలిని పేర్కొన్న ఆస్తుల విలువ భారీగా ఉంది. తనకు వంద కోట్ల రూపాయలకు పై స్థాయిలో ఆస్తులున్నాయని హేమమాలిని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొంది. అలనాటి ఈ డ్రీమ్ గర్ల్ వంద కోట్ల రూపాయల పై రేంజ్ ఆస్తులను కలిగి ఉండటం ఆసక్తిదాయకంగా ఉంది.

ఇక తను కూడా ఏమీ తీసిపోవడం లేదని అంటోంది ఊర్మిల. ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న ఊర్మిల తన ఆస్తుల విలువ అరవై ఎనిమిది కోట్ల రూపాయలు అని ప్రకటించింది. భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేసిన ఆమె అరవై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తులను ప్రకటించింది.

మొత్తానికి ఈ గ్లామరస్ తారలు.. పైకి కామ్ గా కనిపిస్తున్నా, వీరి ఆస్తులు మాత్రం భారీ స్థాయిలో ఉన్నట్టున్నాయని వీరి అభిమానులు కూడా అంటున్నారు!
Tags:    

Similar News