బ్రతికున్నప్పటికంటే మరణించిన తర్వాతే నయీం గురించి ప్రపంచానికి ఇప్పటివరకూ తెలియని ఎన్నో సంఘటనలు తెలుస్తున్నాయి. పోలీసుల చేతకానితనమా నాయకుల అండదండలా, లేక సామాన్యుల దురదృష్టమా అనే విషయాలు కాసేపు పక్కన పెడితే.. నయీం మృతి అనంతరం వెలుగు చూస్తున్న విషయాలు మాత్రం సామాన్యుడికి నిద్రపట్టనివ్వడంలేదు. ఈ సమాజంలో సామాన్యుడు ఎంత అభద్రతాభావంతో బ్రతుకుతున్నాడు అనే విషయాలను నయీం మృతి చెప్పకనే చెబుతుంది. నిన్న మొన్నటివరకూ బడా బడా నాయకులు - పారిశ్రామిక వేత్తలు - పెద్ద పెద్ద వ్యాపారులు - రియల్ ఎస్టేట్ వ్యవహారులు నయీం బాదితులుగా వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ లిస్ట్ లో ప్రముఖ హీరోయిన్ కూడా చేరిపోయింది.
ఇప్పటికే ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న గ్యాంగ్ స్టర్ నయీం భూదందాల్లో కొత్తకేసు ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. నయీం భూకబ్జా బాధితుల్లో ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఉన్నారన్నది తాజా సమాచారం. నానక్ రాం గూడ ప్రాంతంలో ఒక ప్రముఖ హీరోయిన్ ఆరు ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారట. హీరోయిన్ కి సినిమాల్లో అంటే హీరోలు మద్దతుగా నిలుస్తారు - ఆమె ఒంటిపై గీతపడకుండా ఆమె కష్టాన్ని తన కష్టంగా భావించి ఆదుకుంటారు. కానీ.. నిజ జీవితంలో అలాంటి అవకాశాలు మాగ్జిమం ఉండవు కాబట్టి.. ఆ హీరోయిన్ ల్యాండ్ పై నయీం కన్నువేశాడు. దీంతో ఆరెకరాల ఏకచెక్క - సూపర్ స్పేస్ కావడంతో ఆ స్థాలాన్ని కబ్జా చేసి స్వాధీనపరచుకున్నాడట.
అయితే ఈ విషయం చెబితే ఆమె ప్రాణలకు ప్రమాదం అని బెదిరించాడో లేక ఆ కబ్జాలో పోలీసులు కూడా ఉన్నారని ఆమె గ్రహించిందో కానీ.. ఈ విషయం నయీం బ్రతికుండగా వెలుగులోకి రాలేదు. అయితే ఆమె గ్రహించిన విషయాన్ని నిజంచేస్తూ వెలుగులోకి వచ్చిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ కబ్జా వ్యవహారంలో నయీంకు నిజంగానే కొంతమంది పోలీసులు సైతం సహకరించారట!!
ఇప్పటికి సినిమా ఇండస్ట్రీకి సంబందించి ఒక్క హీరోయిన్ మాత్రమే వెలుగులోకి వచ్చింది.. ఇంకా ఈ లిస్టులో చేరే వారి సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చనేది కొందరు అభిప్రాయపడుతుంటే... రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు సినిమా వాళ్లవద్ద కూడా డబ్బులు దండిగా ఉంటాయనేది నయీం ఆలోచనలోకి రాకుండా ఎలా ఉంటుంది అనేది మరికొందరి ప్రశ్నగా ఉంది!