స్మార్ట్ ఫోన్ తోనే హైటెక్ వ్యభిచారం ... కాలేజీ అమ్మాయిలే టార్గెట్ !

Update: 2020-03-18 15:30 GMT
చిత్తూరు జిల్లా పలమనేరు మండలం వీకోటలోని లాడ్జిలో యధేఛ్చగా జరుగుతున్న వ్యభిచార ముఠా గుట్టు ఇటీవల పోలీసులు రట్టు చేసిన సంగతి తెలిసిందే. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచి వారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్‌ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు చర్చించుకుంటున్నారు. టెక్నాలజీ సాయం తో అనేక లాడ్జీలు, హోటళ్లను కేంద్రంగా చేసుకుని హైటెక్‌ వ్యభిచారం జోరుగా సాగిస్తున్నారు. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అమ్మాయిలను ఎంచుకుని వారిని మాయమాటల తో మభ్యపెట్టి సెక్స్‌వర్కర్లుగా మారుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వ్యభిచారం చేస్తే సులువుగా డబ్బు సంపాదించుకోవచ్చని, లగ్జరీగా బ్రతకొచ్చంటూ టీనేజీ అమ్మాయిలకు వల వేస్తున్నారు.

ప్రస్తుతం అందరి దగ్గర..స్మార్ట్ ఫోన్స్ ఉండటం తో, ఆ ఫోన్స్ ను ఉపయోగించుకొని మొదట సోషల్‌ మీడియా ద్వారా అమ్మాయిల తో పరిచయాలు పెంచుకుని వారి స్ధితి గతులు తెలుసుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. పలమనేరునియోజవర్గంలో జరుగుతున్న వ్యభిచార దందా మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. సోషల్‌మీడియాను వేదికగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు టీనేజీ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని సెక్స్‌రాకెట్లో ఇరికిస్తున్నట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్, టిక్‌ టాక్ వంటి సోషల్‌మీడియా యాప్‌ల ద్వారా పరిచయం పెంచుకుని, వివరాలు తెలుసుకుని బెదిరింపులకు దిగుతున్నారు. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని కుటుంబాలకు చెందిన యువతులను డబ్బు ఆశ చూపించి సెక్స్‌వర్కర్లుగా మారుస్తున్నారు. అలా మెల్లమెల్లగా వారిని వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు, బయటకి వద్దామనుకున్న కూడా మళ్లీ బయటకు రావడం కష్టమే.

వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్‌ యాప్‌లోకి అడ్మిట్‌ చేయిస్తారు. డేటింగ్‌ యాప్స్‌లో ముఖ్యమైన ఇన్‌ స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్‌ యాప్‌, జస్ట్‌ ఫ్రెండ్స్, క్వాక్‌ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్‌ చాట్, విగో, టిండర్, క్రస్‌ లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు.ఇందులో నియర్ బై అనే ఆప్షన్ ద్వారా సమీప ప్రాంతాల్లోని ఉన్న అమ్మాయిల తో డేటింగ్‌ తో పాటు వ్యభిచారానికి సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. రోజుకు రెండు మూడు గంటలు కష్టపడితేనే రూ.వేలల్లో సంపాదన ఉండటం తో చాలామంది మహిళలు భవిష్యత్తును పట్టించుకోకుండా ఈ వ్యభిచార కూపంలోకి జారుతున్నారు.

కర్ణాటకలోని బెంగళూరు, కోలార్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యభిచార నిర్వాహకులు పలమనేరు, గంటావూరు, వి.కోట తదితర ప్రాంతాల్లో టీమ్‌ లుగా ఏర్పడి స్మార్ట్‌ఫోన్ల ద్వారా హైటెక్ వ్యభిచారాన్ని యథేచ్చగా నిర్వహిస్తున్నారు. వీరు  డైరెక్ట్‌ గా కలవరు. అంతా ఫోన్లలోనే. డబ్బులు కూడా ఆన్‌ లైన్‌ ట్రాన్స్‌ ఫర్ చేయించుకుంటున్నారు. డబ్బులు అకౌంట్లో క్రెడిక్ కాగానే.. అమ్మాయి, లాడ్జి వివరాలు వారికి వెళ్లిపోతున్నాయి. దీంతో గుట్టుగా పని పూర్తయిపోయి ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. నియోజకవర్గంలోని అనేక లాడ్జీలు, ఖరీదైన ఇళ్లు హైటెక్‌ వ్యభిచారానికి అడ్డాలుగా మారినట్లు తెలుస్తోంది. ఇళ్లకైతే బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో అయితే దీనికోసం ప్రత్యేక గదులే బుక్ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Tags:    

Similar News