కరోనా మహమ్మారి తన పుట్టింట్లో రోజురోజుకు విజృంభిస్తోంది. దీంతో చైనాలో కేసులు సంఖ్య గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు ఆందోళనలు చేపట్టడంతో చైనా ఆ నిబంధనను సడలించింది. ఈ నేపథ్యంలో గత 15 రోజులుగా కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతూ పోతుంది.
చైనాలోని ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఆస్పత్రుల్లో కరోనా పేషంట్లకు సరిపడా బెడ్స్ లేక రోడ్లపైనే తమ వంతు వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. కరోనా లక్షణాలతో కొంతమంది తమ కార్లలో సెలైన్ బాటిళ్లు ఎక్కించుకుంటూ దర్శనమిస్తున్నారు. చైనా వ్యాప్తంగా ఇలాంటి దృశ్యాలు కన్పిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
చైనాలో క్రమంగా పెరుగుతున్న కేసులపై అమెరికాలోని ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగెల్ డింగ్ తాజాగా స్పందించారు. రాబోయే మూడు నెలలు చైనా అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చైనాలోని 60 శాతం మందికి పైగా కరోనా బారిన పడే ప్రమాదం ఉందని.. ప్రపంచ వ్యాప్తంగా మరో 10 శాతం మంది మహమ్మారి బారిన పడే అవకాశం ఉందని అంచనా వేశారు.
చైనా కరోనా విజృంభణ ఇదే ఆరంభమేనని వెల్లడించారు. చైనాలో నమోదు అవుతున్న కేసులు.. మరణాలు అధికారికంగా బయటకు రావడం లేదని తెలిపారు. కాగా బీజింగ్ లో నాలుగు నెలల తర్వాత రెండు కరోనా మరణాలు నమోదైనట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే అంతర్జాతీయ మీడియా మాత్రం చైనాలోని బీజింగ్ శ్మశాన వాటికలు కోవిడ్ మృతదేహాలతో నిండిపోతున్నాయని పేర్కొంటున్నాయి.
రోజుకు సగటున 200ల మృతదేహాలు ఆ శ్మశాన వాటికకు వస్తున్నాయని అక్కడ పని చేసే సిబ్బంది వెల్లడించినట్లు పేర్కొంటున్నాయి. చైనా అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 5వేల327 మంది కరోనాతో మృతి చెందినట్లు ప్రకటించారు. ఇతర దేశాల్లో కరోనా వైరస్ సోకి మరణిస్తే దానిని కోవిడ్ మరణాలు గానే పరిగణిస్తున్నారు.
అయితే చైనాలో మాత్రం కోవిడ్ మరణాలను మాత్రం చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు. ఏది ఏమైనా రాబోయే మూడు నెలల్లో చైనా కరోనా కేసులు పీక్స్ చేరే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత నుంచి కేసుల సంఖ్య మళ్లీ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.