వల్లభనేని వంశీకి క్లాస్ పీకిన హైకమాండ్!?

Update: 2020-08-03 11:38 GMT
వల్లభేని వంశీ.. ఈ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే ఎంత దూకుడుగా వెళుదామని చూసినా అతడి ఆటలు వైసీపీలో సాగడం లేదు. మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లి గెలిచి అధికారికంగా వైసీపీ ఎమ్మెల్యే అవుదామని కలలుగంటున్నా... వైసీపీ అదిష్టానం మాత్రం వంశీ దూకుడుకు అడ్డకట్ట వేస్తోంది. మిగతా ఎమ్మెల్యేల పరిస్థితిని ఆలోచించకుండా ఎన్నికలకు తొడగొడుతున్న వంశీకి హైకమాండ్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.

రాజీనామాకు సిద్ధం అంటూ తాజాగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రకటించారు. సీఎం జగన్ కు కూడా చెప్పానని వివరించాడు. దీంతో వంశీ రాజీనామా ఎఫెక్ట్ మిగతా ఎమ్మెల్యేల మీద పడుతుందని హైకమాండ్ కు పెద్ద ఎత్తున ఫిర్యాదు వెళ్లాయని తెలిసింది. దీంతో సీఎం జగన్ ప్రస్తుతం ఏపీలో అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆలోచిస్తూ అమలు చేస్తుంటే ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయ ప్రకటనలు ఏంటి అని గుంటూరు-కృష్ణ నాయకులు పెద్ద ఎత్తున హైకమాండ్ కు ఫిర్యాదు చేశారట.. హైకమాండ్ లో ఉన్న నాయకులు వల్లభనేని వంశీకి క్లాస్ పీకి ఇలాంటి ప్రకటనలు చేసే పద్ధతి మానుకోవాలి అన్నట్టు విజయవాడ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ఎన్నికలకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా లేదు. రాయలసీమ ఎత్తిపోతల సహా చాలా సంక్షేమ పథకాలు పెట్టి అమలు చేస్తోంది. పైగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తోంది. అందుకే ఈ టైంలో ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరం కాదని భావిస్తోంది. అందుకే ఎన్నికల కోసం తపనపడుతున్న వంశీకి అధిష్టానం క్లాస్ పీకినట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News