ఎన్నికలకు ముందు అవినీతి నిర్మూలన గురించి తెగ మాట్లాడేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఆ అంశంపై నోరు విప్పింది లేదు. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన వారిపై చర్యలు తీసుకున్నది లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రత్యేకించి ఇసుక మాఫియా ఆరాచకాలు మితిమీరిపోయాయన్న విమర్శ ఉంది.
తెలుగు దేశం పార్టీకి చెందిన నేతల నేతృత్వంలో ఇసుక మాఫియా చెలరేగిపోతుందన్న బలమైన ఆరోపణలు వచ్చాయి. అయితే.. వీటిపై మీడియా ఫోకస్ తక్కువగా ఉండటంతో.. ఈ విషయాలు బయటకు పెద్దగా వచ్చింది లేదు. అయితే.. అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో ఇసుక దందా.. ఏపీ ప్రజల కళ్ల వెంట కన్నీరు పెట్టిస్తోంది. దిగువ.. మధ్యతరగతి.. వర్గాల వారి దుస్థితి మరింత దారుణంగా ఉంది.
ఇసుక తరలింపును అడ్డుకునే విషయంలో ఏపీ సర్కారు గట్టిగా ప్రయత్నించింది పెద్దగా లేదన్న విమర్శను మూటగట్టుకుంది. తాజాగా.. ఇసుక మాఫియా తీరుపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని ఇసుక తవ్వకాలపై మండిపడిన కోర్టు.. ఇసుక తరలింపు పెద్ద మాఫియాగా మారిందని పేర్కొంది.
కోర్టు సైతం ఇసుక తరలింపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇసుక తరలింపు పెద్ద మాఫియాలా తయారైందని వ్యాఖ్యానించింది. భావి తరాలకు ఇసుక అవసరమని వ్యాఖ్యానించింది. ఇసుక అక్రమ రవాణాపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్న బాబు సర్కారుకు.. కనీసం హైకోర్టు ధర్మాగ్రహమైనా సురుకు పుడుతుందా..?