ఒక కేసు విచారణలో హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తన విచారణలో భాగంగా చేసిన వ్యాఖ్యల్లో దుర్యోధనుడు.. రావణుడు.. శ్రీరాముడి ప్రస్తావన తీసుకొచ్చింది. అసలీ ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఏ కేసుకు వచ్చింది? అన్న ప్రశ్నల్లోకి వెళితే..
ఎమ్మార్ కేసులో సీబీఐ తనను అనవసరంగా ఇరికించిందని.. తనపై నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారి ఐఏఎస్ అధికారి.. మాజీ ఎపీఐఐసీ ఎండీ ఎల్వీ సుబ్రమణ్యం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
రాజే ధర్మమైతే అది దుర్యోధనుడు..రావణుడిల పాలన ఉంటుంది. ధర్మమే రాజైతే శ్రీరాముడి పాలనలా ఉంటుందని ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ చిన్నకథలు పుస్తకంలో పేర్కొన్న విషయాన్ని హైకోర్టు పేర్కొంది. రాజే ధర్మమని భావించినప్పుడు రాజుకు అనుకూలంగా మంత్రులు అనుసరించాల్సి వస్తుందని.. అలాంటప్పుడు ఆ ప్రభావం మంత్రులపైనా ఉంటుందని.. ఇప్పుడు అదే కొనసాగుతుందని.. అధికారుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా ఉందని పేర్కొంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని తెలిసినా తప్పని చెబితే ఎలా ఉంటుందో.. ఏమవుతుందోనని మౌనంగా ఉండిపోతున్నారంటూ ఉమ్మడి హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏపీఐఐసీ ఎండీగా ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణ ఉందని.. ఉదాసీనత కుట్ర ఎలా అవుతుందో చెప్పాలంటూ సీబీఐని ప్రశ్నించింది. ఎమ్మార్ కు ఎకరా రూ.40 లక్షలుగా నిర్ణయించాలని ఏపీఐఐసీ అధికారులు సూచించినా రూ.29 లక్షలకే కేటాయించారని సీబీఐ తరఫు న్యాయవాది వాదించారు. ఏపీఐఐసీ సీనియర్ మేనేజర్ సలహాను పట్టించుకోకుండా కుట్రలో భాగంగా రూ.29 లక్షలకే కేటాయించటానికి సిఫార్సు చేశారన్నారు. ఉద్దేశపూర్వకంగా వ్యవహరించటం కుట్ర అవుతుందని.. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కోల్పోయిందని పేర్కొంది. ఈ కేసు విచారణను వాయిదా వేశారు.