కోడి ముందా..? పందెం ముందా?

Update: 2016-12-26 06:56 GMT
ఏపీలో సంక్రాంతి పండగంటే ఆ సందడే వేరు. రాష్ర్టమంతా ఎక్కడికక్కడ స్థానిక ఆచారాల ప్రకారం బ్రహ్మాండంగా జరుపుకొంటారు. గోదావరి జిల్లాల్లో అయితే కోడి పందేలతో సందడి నెలకొంటుంది. కోడి పందాల పేరిట మూగ జీవాలను హింసించడం సరికాదని జంతు ప్రేమికులు ఎంతగా వాదిస్తున్నా సందేలను మాత్రం ఆపరు. కాగా ఈ ఏడాది సంక్రాంతికి  ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలను నిర్వహించేందుకు వీల్లేదని తెలుగు రాష్ట్రాల హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశించడంతో గత ఏడాది మాదిరిగానే మళ్లీ వాతావారణం వేడెక్కింది.  
    
కోడి పందాలపై వాదనలు విన్న న్యాయమూర్తులు నిషేధం విధించారు. పందేల పేరుతో కోళ్లను హింసిస్తున్నారని హైకోర్టు అభిప్రాయపడింది. పందాలు నిర్వహించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది.
    
అయితే.. ఏటా మాదిరిగానే ఈసారీ బడాబాబులు... వారికి వత్తాసుగా ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగి పందేలు వేస్తారని భావిస్తున్నారు.  కోర్టు ఆదేశాలు కేవలం ఆదేశాలు గానే మిగిలిపోతాయని అనుకుంటున్నారు.  హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో పందేలు ఆడరాదంటూ ప్రభుత్వం కూడా గత ఏడాది మాదిరిగానే హడావుడి చేయడం ఖాయం. కానీ.. అదే సమయంలో ఏమాత్రం భయం లేకుండా ఎంపీలు - ఎమ్మెల్యేలు - చివరకు మంత్రులు సమక్షంలోనే పందేలు జరగడం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News