ఏపీ డీజీపీని కోర్టుకు రావాలంటూ హైకోర్టు షాక్

Update: 2020-02-12 10:45 GMT
ఏపీ పోలీస్ డీజీపీకి ఊహించని షాక్ తగిలింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తాజా ఆదేశం ఆయనకు ఇబ్బందిని కలిగించనుంది. మిస్సింగ్ కేసులో పోలీసుల నిర్లక్ష్యంతో వ్యవహరించిన దానికి డీజీపీ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు వ్యక్తుల (గౌతమ్, లోచిని)ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారంటూ గతంలో హైకోర్టులో హెబియస్ కార్పరస్ పిటీషన్ దాఖలైంది.

దీనిపై విచారించిన హైకోర్టు జ్యూడిషియల్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. విచారణ కోసం విశాఖ సివిల్ సిటీ జడ్జిని నియమించారు. దీనికి సంబంధించిన నివేదికను హైకోర్టు ధర్మాసనానికి అందజేశారు. ఇందులోని అంశాన్ని పరిశీలించిన హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది.

దీని ప్రకారం ఈ నెల పద్నాలుగున ఏపీ డీజీపీ సవాంగ్ హైకోర్టుకు స్వయంగా వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాదు.. ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలను వెంట తీసుకురావాలని కూడా ఆదేశాల్ని జారీ చేసింది. కిందిస్థాయి సిబ్బంది చేసిన పనికి ఏపీ పోలీస్ బాస్ స్వయంగా హైకోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News