ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ట్విస్ట్ ఇదే

Update: 2021-03-09 12:59 GMT
ఏపీలోని అన్ని కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నా పశ్చిమ గోదావరిలోని ఏలూరు మున్సిపాలిటీకి మాత్రం ఎన్నికలు జరగడం లేదు. ఈ కార్పొరేషన్ లో ఓటర్ల జాబితా, వార్డుల పునర్విభజనపై 40కి పైగా పిటీషన్లు హైకోర్టులో దాఖలు కావడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.

తాజాగా ఈ పిటీషన్లు అన్నింటిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మంగళవారం ఈ విధంగా తీర్పునిచ్చింది.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలను నిర్వహించాలంటూ మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది.

అయితే ఎన్నికలను జరిపి ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంటూ ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 23కి వాయిదా వేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.నిన్న ఎన్నికలు ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు తాజాగా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
Tags:    

Similar News