మరోసారి తండ్రి అయిన మస్క్... రియాక్షన్ ఇదే!

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో, ట్రంప్ 2.0లో డోజ్ సారథి అయిన ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు.

Update: 2025-03-01 07:11 GMT

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో, ట్రంప్ 2.0లో డోజ్ సారథి అయిన ఎలాన్ మస్క్ మరోసారి తండ్రి అయ్యారు. ఇప్పటికే 13 మంది పిల్లలకు తండ్రి అయిన ఎలాన్ మస్క్.. తాజాగా 14వ బేబీకి వెల్ కం చెప్పారు. ఈ సందర్భంగా... న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, ఎలాన్ మస్క్ భాగస్వామి అయిన షివోన్ జలీస్ కు మగబిడ్డ జన్మించాడు.

అవును... ప్రపంచ కుబేరుడు పద్నాలుగోసారి తండ్రయ్యారు! ఈ సందర్భంగా... ఇప్పటికే మస్క్ – జలిస్ దంపతులు ముగ్గురు మగ బిడ్డలను కలిగి ఉండగా.. తాజాగా నాలుగో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా ఈ విషయాలను ఎక్స్ వేదికగా వెళ్లడించిన షివోన్ జిలీస్... ఈ బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ అని నామకరణం చేసినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా.. "మస్క్ తో చర్చించాను.. అందమైన ఆర్కాడియా పుట్టిన రోజు దృష్ట్యా అద్భుతమైన కుమారుడు సెల్టాన్ లైకుర్గస్ గురించి నేరుగా పంచుకోవడం మంచిదని భావించాము" అని ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఇలా షివోన్ జలీస్ ఎక్స్ లో పెట్టిన ఈ పోస్ట్ కు హార్ట్ సింబల్ తో రిప్లై ఇచ్చారు ఎలాన్ మస్క్.

కాగా... ఎలాన్ మస్క్ కు ఫిబ్రవరి 14 కు ముందువరకూ 12 మంది సంతానం అనే సంగతి తెలిసిందే. మస్క్ మొదటి భార్య జస్టిన్ కు జన్మించిన తొలిబిడ్డ అనారోగ్య కారణాలతో 10 వారాలకే మృతి చెందగా.. తర్వాత ఆ జంట ఐవీఎఫ్ విధానం ద్వారా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిద్దరూ 2008లో విడిపోయారు.

ఆ తర్వాత బ్రిటన్ నటి తాలులాహ్ రిలేను మస్క్ వివాహమాడారు. వారికి సంతానం లేదు! ఈ క్రమంలో.. కెనడియన్ గాయని గ్రిమ్స్ తో సంబంధం నడిపారు టెస్లా సీఈఓ! అయితే.. వారికి ముగ్గురు సంతానం కలిగారు. ఈ క్రమంలో... న్యూరాలింక్ లో పనిచేస్తోన్న ఎగ్జిక్యూటివ్ షివోన్ తో మరో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు ఎలాన్ మస్క్!

అయితే... ఇప్పుడు ఆమె తాజాగా మరో మగ బిడ్డకు జన్మనిచ్చారు! ఈ సందర్భంగా మస్క్ హార్ట్ సింబల్ తో వెల్ కం చెప్పారు. ఈ గ్యాప్ లో ఫిబ్రవరి 15న ఎలాన్ మస్క్ కు సంబంధించి రచయిత్రి ఆష్లీ సెయింట్ క్లెయిర్ ఓ సంచలన పోస్ట్ పెట్టారు. ఇందులో భాగంగా తన బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్ అని సోషల్ మీడియా వేదికగా ఆమె వెల్లడించారు.

తమ బిడ్డ గోప్యత, భద్రత దృష్ట్యా ఈ విషయాన్ని తాను ఇంతకుముందు బహిర్గతం చేయలేదని ఆమె తాజాగా పేర్కొన్నారు. తమ గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆమె తన పోస్టులో కోరారు. దీంతో.. ఆ బిడ్డ నెంబర్ 13 కాగా... తాజాగా జన్మించిన సెల్టాన్ లైకుర్గస్ ను మస్క్ 14వ సంతానంగా పేర్కొంటున్నారు!!

Tags:    

Similar News