బాబుతో స‌హా 57 మందికి హైకోర్టు నోటీసులు

Update: 2017-09-19 10:16 GMT
హైకోర్టు స్పందించింది. అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై దాఖ‌లు చేసిన పిటిష‌న్‌కు స‌మాధానం చెప్పాలంటూ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా మ‌రో 57 మందికి నోటీసులు జారీ చేసింది. కృష్ణా న‌ది ప‌రివాహ‌క క‌ర‌క‌ట్ట ప్రాంతంలో అక్ర‌మ నిర్మాణాల‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు.

ప్ర‌స్తుతం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసం ఉంటుంది ఆయ‌న సొంత నివాసం కాదు. లింగ‌మ‌నేని గ్రూపు నుంచి ఈ భ‌వ‌నాన్ని లీజుకు తీసుకున్నారు. అయితే.. ఈ భ‌వ‌నం కృష్ణాన‌ది ప‌రివాహ‌క క‌ర‌క‌ట్ట ప్రాంతంలో న‌దీ ప‌రిర‌క్ష‌క చ‌ట్టానికి విరుద్ధంగా క‌ట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో ఈ భ‌వ‌న నిర్మాణం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా నిర్మించారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆళ్ల హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నివాసంతో పాటు 57 మంది కూడా నిబంధ‌న‌ల్ని ఉల్లంఘించి నిర్మించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆళ్ల దాఖ‌లు చేసిన పిటిస‌న్‌ను విచార‌ణ‌కు అంగీక‌రించిన హైకోర్టు.. చంద్ర‌బాబుతో స‌హా 57 మందికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని కోరింది.

ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి నివ‌సించే నివాసానికి సంబంధించి.. అన్ని కోణాల్లో ప‌రిశీలించి లీజుకు తీసుకుంటే బాగుండేద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. సాక్ష్యాత్తు ముఖ్య‌మంత్రి ఇల్లే (సొంత‌ది కాన‌ప్ప‌టికీ) అయిన‌ప్ప‌టికీ ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు లేకుండా ఉండేలా ఉంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News