ఎల్ఆర్ఎస్ పై విచారణ.. హైకోర్టు కీలక నిర్ణయం

Update: 2021-01-20 14:30 GMT
కరోనా లాక్ డౌన్ వేళ ప్రజల భూముల క్రమబద్ధీకరణ పేరుతో సీఎం కేసీఆర్ మొదలుపెట్టిన ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) జనాల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆ దెబ్బకు కేసీఆర్ కు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చుక్కలు కనిపించాయి. దీంతో ఈ ఎల్ఆర్ఎస్ పై ఆల్ రెడీ కేసీఆర్ వెనక్కితగ్గాడు.

అయితే ఎల్ఆర్ఎస్ పై ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేశారు. ఈ క్రమంలో దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు ఆ పథకాలకు సంబంధించి ప్రజలపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ హైకోర్టులో సుధీర్ఘ వాదనలు వినిపించారు. ఎల్ఆర్ఎస్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని.. ఎనిమిది వారాల్లో వివరణ ఇవ్వాలని దేశంలోని అన్ని రాష్ట్రాలను సుప్రీం కోర్టు ఆదేశించిందని ఏజీ వివరించారు.

ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాతే తెలంగాణ హైకోర్టులో దీనిపై విచారణ ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను వాయిదా వేసింది.

2016లోనే తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ పథకం తీసుకొచ్చింది. ఇటీవల ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తులు ఆహ్వానించింది. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటన్నింటిపై విచారించి హైకోర్టు వాయిదా వేసింది.




Tags:    

Similar News