కేసీఆర్‌ కు షాక్ తినిపించిన మాజీ మిత్రుడు

Update: 2016-03-25 04:14 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాజీ స‌న్నిహితుడు ఆయ‌న‌కు చుక్కలు చూపించారు! తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్‌తో కలిసి న‌డిచి గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయాల కార‌ణంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన దాసోజు శ్ర‌వ‌ణ్ తాజాగా కేసీఆర్‌ కు షాక్ తినిపించారు. కేసీఆర్ చెప్పేదొక‌టి, చేసేది ఒక‌టి అనేదాన్ని నిరూపిస్తూ ఏకంగా కోర్టులోనే కేసు గెలిచారు.

త‌మ‌ది పార‌ద‌ర్శ‌క ప్ర‌భుత్వం అని చెప్పుకొనే కేసీఆర్ అందుకు పూర్తి వ్య‌తిరేకంగా ప్ర‌భుత్వ జీవోల వెబ్‌ సైట్‌ ను మూసివేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆయా వ‌ర్గాలు ఫైర్ కాగా దాసోజు శ్ర‌వణ్ ఏకంగా హైకోర్టులో కేసు వేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి వెబ్ సైట్‌ ను అందుబాటులో ఉంచ‌కుండా చేశార‌ని పేర్కొంటూ ఈ చర్య  సమాచార హక్కు చట్టం సెక్షన్ 4కు విరుద్ధమ‌ని శ్రవణ్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువ‌చ్చారు. దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ధ‌ర్మాస‌నం ప్ర‌భుత్వంపై ఫైర్ అయింది. పార‌ద‌ర్శ‌కంగా ఉండాల్సింది ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని నిల‌దీసింది.

జీవోల వెబ్‌ సైట్ ఎప్పటివ‌ర‌కు అందుబాటులో ఉంచుతార‌ని ప్రశ్నించింది. దీంతో సాంకేతిక కార‌ణాల వ‌ల్ల జాప్యం జ‌రుగుతోంద‌ని పేర్కొంటూ...త్వ‌ర‌లో సరిదిద్ది అందుబాటులో ఉంచుతామ‌ని ప్ర‌భుత్వ త‌ర‌ఫు న్యాయ‌వాది తెలిపారు. కేసీఆర్ ప్ర‌భుత్వంపై అనేక కేసులు న‌మోదై వాటి విష‌యంలో మొట్టికాయ‌లు ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. అయితే ఇంత ఘ‌టుగా అది కూడా మాజీ మిత్రుడి నుంచి ఎదుర్కోవ‌డం ఆస‌క్తిక‌ర‌మే.
Tags:    

Similar News