డీజీపీ, హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు .. ఏ విషయంలో అంటే!

Update: 2021-01-25 09:50 GMT
'ఓ పోలీసు అధికారి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించినందుకు గాను,  రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే ఈరోజు  రాష్ట్ర డీజీపీ, హోంశాఖ కార్యదర్శి  హైకోర్టు కి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ , వారిద్దరూ కూడా హైకోర్టు ముందు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో మరో అవకాశం ఇస్తూ , ఈ నెల కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాలని డీజీపీ, హోం సెక్రటరీకి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

పోలీస్ అధికారికి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అంశంలో కోర్టు ధిక్కారం కింద ఈరోజు హాజరు కావాలని గతంలో కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే , ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని అధికారులు అఫిడవిట్ దాఖలు చేయగా, దీనిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చేవరకు ఎన్నికలపై అన్నీ వాయిదా వేయాలని సీఎస్ కోరారని, కానీ మీరేమో ఎన్నికల విధుల్లో ఉన్నామని కోర్టుకి చెప్తున్నారు, అది  ఎలా సాధ్యమని కోర్టు ప్రశ్నించింది. ఈనెల 27న కోర్టుకు హాజరు కావాలంటూ డీజీపీ, హోంసెక్రటరీకి హైకోర్టు స్పష్టం చేసింది.
Tags:    

Similar News