గుండె ఆగిపోయేలా కొడుతారా?.. మరియమ్మ లాకప్ డెత్ పై హైకోర్టు ఆగ్రహం

Update: 2021-11-11 13:30 GMT
మరియమ్మ లాకప్ డెత్ పై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. పోలీసులను న్యాయస్థానం సూటిగా ప్రశ్నించింది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా? అని హైకోర్టు ప్రశ్నించింది.

నల్గొండ జిల్లా అడ్డగూడురు పోలీస్ స్టేషన్ లో మరియమ్మ అనుమానాస్పదంగా మృతి చెందింది. మరియమ్మ మృతిపై పీయుసీఎల్ హైకోర్టు పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణలో న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. మరియమ్మ మృతిపై హైకోర్టుకు మెజిస్ట్రేట్ విచారణ నివేదికను సమర్పించారు. మరియమ్మ లాకప్ డెత్ కేసు సీబీఐకి అప్పగించదగిన కేసని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి హైకోర్టు నోటీసులిచ్చింది. ఈనెల 22న విచారణకు రావాలని సీబీఐ ఎస్పీకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కేసు పూర్తి వివరాలను అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌కు అప్పగించాలని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ కు కోర్టు ఆదేశించింది.


ఎస్ఐ, కానిస్టేబుల్‌ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు అడ్వకేట్‌ జనరల్‌ హైకోర్టుకు తెలిపారు. బాధ్యులపై క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. మరియమ్మ కుటుంబానికి పరిహారం చెల్లించినట్లు ఏజీ తెలిపారు. పరిహారం ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర ఆరోగ్య సమస్యలతో మరియమ్మ గుండె ఆగి చనిపోయిందని ఏజీ కోర్టుకు తెలిపారు. రెండో పోస్టుమార్టం నివేదికలో మరియమ్మపై గాయాలున్నాయని హైకోర్టు పేర్కొంది. గుండె ఆగిపోయేలా ఎవరైనా కొడతారా అని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ వంటి స్వతంత్ర సంస్థల దర్యాప్తు అవసరమని కోర్టు అభిప్రాయపడింది. సీబీఐ, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 22కి హైకోర్టు వాయిదా వేశారు.

యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం గోవిందాపురంలోని చర్చి ఆవరణలో ఓ చర్చి ఫాదర్ ఇంట్లో మరియమ్మ వంట మనిషిగా పనిచేసేది. తన ఇంట్లో దొంగతనం చేశారని చర్చి ఫాదర్ అడ్డగూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముందుగా మరియమ్మ కుమారుడు ఉదయ్‌, ఆయన స్నేహితుడు శంకర్ ను అరెస్ట్ చేసి విచారించారు. వారిద్దరి వాంగ్మూలం ఆధారంగా మరియమ్మను కూడా పోలీసులు తరువాత అదుపులోకి తీసుకున్నారు. అయితే మరియమ్మ అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమెను పోలీసులే హత్య చేశారని బంధవులు ప్రజా సంఘాలు ఆరోపించాయి. ఈ కేసులు సీఎం కేసీఆర్ కూడా సీరియస్ తీసుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీని ఆదేశించారు. మరియమ్మ కుమారుడికి ఇల్లు, ఉద్యోగం, రూ. 15 లక్షలు, కూతుళ్లు ఇద్దరికీ చెరో 10 లక్షల ఆర్థిక పరిహారం ప్రకటించారు. ఈ కేసులో అడ్డగూడురు ఎస్ ఐ మహేష్, కానిస్టేబుళ్లు జానయ్య, రైటర్ రషీద్ లను సస్పెండ్ చేశారు.






Tags:    

Similar News