హెల్మెట్ పై హైకోర్టు మరోసారి అగ్రహం వ్యక్తం చేసింది. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్న రూల్ ను హైదరాబాద్ లో ఎందుకు అమలు చేయరంటూ తెలంగాణ సర్కారును నిలదీసింది. ఈ సందర్భంగా చైన్ స్నాచర్లు హడావుడి నేపత్యంలో హెల్మెట్ ధారణను తప్పనిసరి అన్నట్లు అమలు చేయలేకపోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర న్యాయవాది విన్నవించారు. దీనిపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేయాలని.. ఈ రూల్ ను కఠినంగా అమలు చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హెల్మెట్ ధరించని వారికి విధించే జరిమానాలు హెల్మెట్ ధర కంటే భారీగా ఉండాలని సూచించింది. హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెలరేగిపోవటం ఖాయం. హెల్మెట్ విషయంలో హైదరాబాదీయులు వెనువెంటనే స్పందించి జాగ్రత్త పడాల్సిందే. లేకుంటే.. జేబుకు భారీగా చిల్లు పడటం కాయం.