స‌హ‌జీవ‌నం ఆమోదం కాదుః హైకోర్టు

Update: 2021-05-18 12:30 GMT
స‌హ‌జీవ‌నం అనేది సామాజికంగా, నైతికంగా ఆమోద‌యోగ్యం కాద‌ని పంజాబ్‌-చండీగ‌ఢ్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో లివ్ ఇన్ రిలేష‌న్ షిప్ పెరుగుతున్న వేళ కోర్టు చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. ఇంటి నుంచి పారిపోయిన ఓ జంట.. కోర్టును ర‌క్ష‌ణ కోర‌గా పై విధంగా వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.

గురువింద్ సింగ్ (22), గుల్జా కుమారి (19) అనే యువ‌తీ యువ‌కులు తాము క‌లిసి నివ‌సిస్తున్నామ‌ని, త్వ‌ర‌లోనే వివాహం చేసుకోబోతున్నామ‌ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే.. త‌మ పెళ్లి కాకుండా పెద్ద‌లు అడ్డుకుంటున్నార‌ని, గుల్జా కుమారీ త‌ల్లిదండ్రుల నుంచి త‌మ‌కు ప్రాణ‌హాని ఉంద‌ని చెప్పారు. అందువ‌ల్ల కోర్టు త‌మ‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని కోరారు.

ఈ కేసు విచార‌ణ సంద‌ర్భంగా న్యాయ‌స్థానం కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ''వాస్తవానికి పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్ ద్వారా తమ లివ్ ిన్ రిలేషన్ కు ఆమోద ముద్ర కోరుతున్నారు. కానీ.. సహజీవనం నైతికంగా, సామాజికంగా ఆమోద‌యోగ్యం కాదు'' అని జ‌స్టిస్ హెచ్ ఎస్ మ‌దాన్ ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.
Tags:    

Similar News